
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జనం జరుగుతున్న ట్యాంక్‌బండ్‌పై అమ్మాయిలను వేధిస్తున్న ఈవ్‌టీజర్లపై నగర షీ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ట్యాంక్‌బండ్‌పై బాలికలను వీడియో తీస్తున్న ఇద్దరు ఆకతాయిలను శుక్రవారం రాత్రి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నాయి. ఒడిశాకు చెందిన శశికాంత్ పాండ, జార్ఖండ్‌కు చెందిన నితీశ్ కుమార్‌లను షీ టీమ్ కార్యాలయానికి తీసుకొచ్చి కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అలాగే నెక్లెస్‌రోడ్డులో అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాప్రాల్ వాసి నాగేంద్రబాబు, సికింద్రాబాద్‌లోని వారాసిగూడ వాసులు రోహిత్, మహేందర్, రామకృష్ణలను షీ బృందాలు పట్టుకున్నామయని నగర క్రైమ్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ షిఖా గోయల్ తెలిపారు.