నిమజ్జనంలో విషాదం
మండవల్లి: మండవల్లి స్టేషన్‌రోడ్‌లో శనివారం వినాయక చవితి నిమజ్జనోత్సవంలో ప్రమాదంలో ఒకరు మరణించారు. ఊరేగింపు స్థానిక సెంటర్ వరకు రాగానే రైల్వేట్రాక్‌కు ఇసుక తోలుతున్న టిప్పర్ ఊరేగింపులో ఉన్న ఇద్దరిని ఢీకొంది. కైకలూరు మండలం భుజబలపట్నంకు చెందిన గంగునేని శ్యామ్, ఎస్సీకాలనీవాసి ప్రత్తిపాడు రాజుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకు ముదినేపల్లి తీసుకువెళుతుండగా శ్యామ్ మరణించాడు.
మృతుని బంధువుల ధర్నా
టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతుని బంధువులు సెంటర్‌లో ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎస్‌ఐ ఎ.మణికుమార్, కైకలూరు సీఐ రవికుమార్ వచ్చి న్యాయం చేస్తామని సర్దిచెప్పారు.