సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అవసరమైన బలగాలను ఇప్పటికే రప్పించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా పెట్టనున్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను కనిపెట్టనున్నారు.
నిమజ్జనాన్ని తిలకించేందుకు సుమారు 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శని వారం బషీర్‌బాగ్‌లోని నగర సీపీ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించా రు. ఇందులో అదనపు సీపీలు జితేందర్, అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. జంట కమిషనరేట్ల సీపీలు వెల్లడించిన వివరాలు ఇలా..
ప్రధాన ఊరేగింపు....
బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రధాన ఊరేగింపు సాగుతుంది. బాలాపూర్ నుంచి కేశవగిరి వరకు సైబరాబాద్ పోలీసులు బందోబస్తు వహిస్తుండగా కేశవగిరి నుంచి నగర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. అలియాబాద్, నాగుల్‌చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా అప్పర్ ట్యాంక్‌బండ్‌వైపు లేక ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనం కోసం వెళ్తాయి.
సికింద్రాబాద్ నుంచి...
సికింద్రాబాద్ నుంచి తరలి వచ్చే గణనాథులు ఆర్పీరోడ్డు, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ జంక్షన్, ఆర్టీసీ జంక్షన్, నారాయణగూడ జంక్షన్, హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ చౌరస్తా వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
ఉప్పల్ వైపు నుంచి...
ఉప్పల్‌వైపు నుంచి వచ్చే గణేశ్‌లు రామంతాపూర్, అంబర్‌పేట, ఎన్‌సీసీ, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి మీదుగా ఆర్టీసీ చౌరస్తాలో సికింద్రాబాద్ వైపు నుంచి ఊరేగింపులో కలవాలి. ఇతర మార్గాల నుంచి వచ్చే వినాయకులు ఎంజే మార్కెట్, తెలుగుతల్లి విగ్రహం వద్ద కలుస్తాయి.
ఆంక్షలు..
పైమార్గాల్లో నిమజ్జనానికి తరలివెళ్లే వాహనాలు మిన హా ప్రధాన రహదారిపై ఇతర వాహనాలను అనుమతించరు.
ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకునేందుకు ప్రజలు రింగ్‌రోడ్డు, బేగంపేట ప్రాంతాలను వాడుకోవాలి.
కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద వాహనాలు అటు ఇటు వెళ్లే అవకాశం ఉంది.
యాత్ర కొనసాగే ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే అంతర్గత రహదారులను బారికేడ్లతో మూసివేస్తారు.
ట్రాఫిక్ మళ్లించే ప్రధాన ప్రాంతాలు...
సౌత్ జోన్ పరిధిలో: కేశవగిరి, మహబూబ్‌నగర్ చౌరస్తా, ఇంజన్‌బౌలి, నాగుల్‌చింత, హిమ్మత్‌పూర్, హరిబౌలి, అస్రా హోటల్, మొగల్‌పురా, లక్కడ్‌కోటే, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దార్ ఉల్ షరీఫ్ చౌరస్తా, సిటీ కాలేజ్
ఈస్ట్ జోన్ పరిధి: చంచల్‌గూడ జైలు చౌరస్తా, మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, సాలార్‌జంగ్ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ కోఠి.
వెస్ట్ జోన్: తోప్ ఖాన్ మాస్క్, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, సీనా హోటల్, అజంతా గేట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐస్‌ల్యాండ్ బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్.
సెంట్రల్ జోన్: చప్పల్‌రోడ్ ఎంట్రీ, గద్వాల్ సెంట్రల్, జీపీ ఓ, షాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలెన్ రోడ్ ఎం ట్రీ, భారత్ స్కౌట్ అండ్ ైగె డ్ జంక్షన్, దోమల్‌గూడ, ఎక్బాల్‌మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్, ఖైరతాబా ద్, చిల్ట్రన్ పార్క్, వైస్రాయ్ హోటల్, కవాడిగూడ, కట్టమై సమ్మ దేవాలయం, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్క్.
నార్త్ జోన్: కర్బలా మైదాన్, బుద్ధభవన్, సైలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్‌ల నుంచి సాధారణ వాహనాలను నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్, ప్యాట్నీ, బాటా, అడవయ్య, ఘాన్స్‌మండి జంక్షన్‌ల వద్ద మళ్లిస్తారు. ఈ ఆంక్షలు సోమవారం ఉదయం 6 నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయి.
వాహనాల పార్కింగ్...
ఖెరతాబాద్ జంక్షన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్
ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ ఆనంద్‌నగర్ కాలనీ, రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం
బుద్ధభవన్ వెనక వైపు గో సేవాసదన్ లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ దేవాలయం
ఎన్టీఆర్ స్టేడియం నిజాం కళాశాల
పబ్లిక్ గార్డెన్స్