
సాక్షి, హైదరాబాద్ : గణేష్ నిమజ్జనానికి భద్రతా పరంగా నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. దాదాపు 21,000 మంది పోలీసులతో, 56 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ‘నగరంలోని 5 జోన్లకు 5 ప్రత్యేక రంగుల ఇండికేషన్ స్టిక్కర్‌లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 7000కు పైగా గణేష్ మండపాలకు రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నారు. ప్రతి గణేష్ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించాం. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉదయమే జరిగేలా ఉత్సవ కమిటీని కోరామని’ తెలిపారు.