
రేపు ఉదయం వరకు గణేష్ నిమజ్జనం
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా గణేష్ నిమజ్జనం రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంది. నగరమంతా వర్షం కురుస్తున్నందున గణేశ్ నిమజ్జన యాత్ర నెమ్మదిగా సాగుతోంది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలకు
వర్షం ఆటంకంగా ఉంది.
ఛార్మినార్, ఎన్టీఆర్ మార్ట్, ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, బషీర్బాగ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలన్నీ గణేష్ విగ్రహాలు, భక్తులతో నిండిపోయాయి. బాలాపూర్ గణేశుని యాత్ర ఎట్టకేలకు చార్మినార్ దాటింది. బషీర్‌బాగ్ నుంచి ఎంజే మార్కెట్ వరకూ విగ్రహాలు నిలిచిపోయాయి.