పుణె: వినాయక నిమజ్జనం సందర్భంగా ఓ అంబులెన్స్ రావడంతో భక్తులు నిట్టనిలువుగా చీలిపోయి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఘటన పుణెలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పుణెలోని లక్ష్మీనగర్ రోడ్డులో వినాయక శోభాయాత్ర గురువారం అట్టహాసంగా సాగుతున్న వేళ అదే దారిలో అంబులెన్స్ వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన అంబులెన్స్ చూసిన అక్కడి భక్తులు, ప్రజలు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించారు. రోడ్డు మీద రద్దీని క్లియర్ చేసి.. అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా దారి కల్పించారు. వినాయక శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలు, భక్తులు రోడ్డుకిరువైపులా నిలువుగా చీలిపోయి.. అంబులెన్స్ ముందుకు కదిలేందుకు వీలుగా దారి ఇచ్చారు. కొందరు యువకులు అంబులెన్స్ ముందు పరిగెడుతూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాహనం ముందుకు కదిలేలా చూశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. ఆపత్కాలంలో మానవీయత ఉట్టిపడేలా వ్యవహరించిన పుణె వాసులను నెటిజన్లు కొనియాడారు.
వైరల్ వీడియో: ఒక్కసారిగా అంబులెన్స్ రావడంతో..
Published Sat, Sep 14 2019 2:59 PM | Last Updated on Sat, Sep 14 2019 8:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment