సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రజలంతా ఫోన్లపైనే రోజంతా గడిపేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్.. ఇలా అన్నింట్లోనూ అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరికొందరు. ఈ సామాజిక మాద్యమాల ద్వారా ఫేమస్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేయకూడని పనులు చేసి నలుగురిలో నవ్వులపాలు అవ్వడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అవ్వాలనే ఉద్ధేశంతో సాహసాలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే పుణెలో వెలుగు చేసింది. గా రీల్స్ మోజులో పడిన కొంతమంది యువతీ, యువకులు.. వ్యూస్ కోసండేంజరస్ స్టంట్లు చేశారు.
పుణె లోని స్వామి నారాయణ్ ఆలయం సమీపపంలోని ఎత్తయిన భవనం నుంచి ఓ యువతి కిందకు వేలాడుతూ ఉండడం వీడియోలో కనిపిస్తోంది. మరో యువకుడు పైనుంచి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. కిందనున్న హైవేపై భారీ వాహనాలు వెళుతున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ తతంగాన్ని వారి స్నేహితులు కెమెరాల్లో చిత్రీకరించారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీనేజర్ల చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై సరైన చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.
#Pune: For Creating Reels and checking the strength, Youngsters risk their lives by doing stunt on an abandoned building near Swaminarayan Mandir, Jambhulwadi Pune@TikamShekhawat pic.twitter.com/a5xsLjfGYi
— Punekar News (@punekarnews) June 20, 2024
Comments
Please login to add a commentAdd a comment