dangeorous
-
చూస్తే.. గోరంత చేపలే! ఇవి శబ్దం చెవులు చిల్లులు పడాల్సిందే!!
ఈ నీటితొట్టెలోని చేపలను చూశారు కదా! ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. వీటి పొడవు దాదాపు గోరంత ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే, ఇవి 10 నుంచి 12 మిల్లీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. పారదర్శకంగా తళతళలాడుతూ చూడచక్కగా ఉంటాయి.అయితే, ఇవి శబ్దం చేస్తే మాత్రం చెవులు చిల్లులు పడాల్సిందే! ఈ చేపలకు శాస్త్రవేత్తలు ‘డేనియోనెల్లా సరీబ్రమ్’ అని పేరుపెట్టారు. వీటి నుంచి వెలువడే శబ్దం 140 డెసిబల్స్ వరకు ఉంటుంది. మామూలుగా మనుషుల చెవులు 70 డెసిబల్స్ వరకు శబ్దాన్ని భరించగలవు. అంతకు రెట్టింపు స్థాయిలో కూత పెట్టగలగడమే ఈ గోరంత చేపల ప్రత్యేకత.వీటి శబ్దం దాదాపుగా జెట్విమాన శబ్దంతో సమానంగా ఉంటుంది. ఈ చేపలను తొలిసారిగా 1980లలో గుర్తించారు. అయితే, ఈ చేపలను పోలిన ‘డేనియోనెల్లా ట్రాన్స్లూసిడా’ అనే మరోరకం చేపలు కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు వీటి లక్షణాలను నిర్దిష్టంగా గుర్తించడంలో కొంత గందరగోళానికి లోనయ్యారు.మూడేళ్ల కిందట ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వీటిపై పరిశోధనలు జరిపి, వీటి కూత శక్తిని తెలుసుకున్నారు. వీటి గొంతు వద్ద ధ్వనికండరాలు, మృదులాస్థి ప్రకంపనల ద్వారానే ఈ చేపలు చెవులు చిల్లులు పడే స్థాయిలో కూత పెట్టగలుగుతున్నాయని గుర్తించారు. వీటి కూత ముందు సింహగర్జన కూడా బలాదూరే! సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్ అయితే, ఈ చేపల కూత శబ్దం 140 డెసిబల్స్. ఇంతకు మించిన శబ్దం చేసే జీవి ప్రపంచంలో మరేదీ లేదు. -
Viral: రీల్స్ మోజులో యువతి పిచ్చి స్టంట్.. చేయి జారిందా అంతే!
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రజలంతా ఫోన్లపైనే రోజంతా గడిపేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్.. ఇలా అన్నింట్లోనూ అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరికొందరు. ఈ సామాజిక మాద్యమాల ద్వారా ఫేమస్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేయకూడని పనులు చేసి నలుగురిలో నవ్వులపాలు అవ్వడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అవ్వాలనే ఉద్ధేశంతో సాహసాలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే పుణెలో వెలుగు చేసింది. గా రీల్స్ మోజులో పడిన కొంతమంది యువతీ, యువకులు.. వ్యూస్ కోసండేంజరస్ స్టంట్లు చేశారు.పుణె లోని స్వామి నారాయణ్ ఆలయం సమీపపంలోని ఎత్తయిన భవనం నుంచి ఓ యువతి కిందకు వేలాడుతూ ఉండడం వీడియోలో కనిపిస్తోంది. మరో యువకుడు పైనుంచి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. కిందనున్న హైవేపై భారీ వాహనాలు వెళుతున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ తతంగాన్ని వారి స్నేహితులు కెమెరాల్లో చిత్రీకరించారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీనేజర్ల చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై సరైన చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.#Pune: For Creating Reels and checking the strength, Youngsters risk their lives by doing stunt on an abandoned building near Swaminarayan Mandir, Jambhulwadi Pune@TikamShekhawat pic.twitter.com/a5xsLjfGYi— Punekar News (@punekarnews) June 20, 2024 -
‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అంటే ఏమిటి? నాలుగు రోజుల్లో వేలమంది ఎలా మృతి చెందారు?
సరిగ్గా 70 ఏళ్ల క్రితం లండన్‌లో ఆ రోజు పగటిపూట హఠాత్తుగా చీకటి కమ్ముకుంది. గాలి కలుషితమై నల్లగా మారి, అంతటా వ్యాపించడంతో వేల మంది ఊపిరాడక మృతి చెందారు. నేటికీ ఈ సంఘటన ఇంగ్లండ్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంది. ఈ ఘటనను ‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అని పిలుస్తారు. విపరీతమైన కాలుష్యం కారణంగా నాలుగు రోజుల్లోనే 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏర్పడిన పొగమంచు వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ భయంకరమైన ‘చీకటి’ 1952 డిసెంబర్ తొలిరోజుల్లో బ్రిటిష్ రాజధాని లండన్‌లో విధ్వంసం సృష్టించింది. ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు, పారిశ్రామిక వినియోగానికి బొగ్గును విపరీతంగా ఉపయోగించడం కారణంగా ఈ నల్లని పొగమంచు ఏర్పడింది. ఈ పొగమంచు 1952 డిసెంబర్ 5న మొదలై, తదుపరి ఐదు రోజులు అంటే డిసెంబర్ 9 వరకు కొనసాగింది. లండన్‌వాసులు అప్పటికే దశాబ్దాలుగా పొగమంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ ఘటన వారిని షాక్‌కు గురిచేసింది. ఈ పొగమంచు కారణంగా లక్ష మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కాలుష్యం కారణంగా ఇక్కడి ప్రజల నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. శ్వాసకోశ వ్యాధులు తలెత్తాయి. లండన్‌లో వాయు కాలుష్యం 13వ శతాబ్దం నుండే మొదలైంది. దీనిని గమనించి 1301లో ఎడ్వర్డ్- I లండన్‌లో బొగ్గును కాల్చడాన్ని నిషేధించారు. 16వ శతాబ్దం నాటికి అక్కడి గాలి అత్యంత విషపూరితంగా మారింది. గ్రేట్ స్మోగ్ అనేది బ్రిటీష్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుంది. 1956లో బ్రిటన్‌లో తొలిసారిగా క్లీన్ ఎయిర్ యాక్ట్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వాతావరణ పరిస్థితుల్లో మెరుగుదల కనిపించింది. ఇది కూడా చదవండి: ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది? -
Secret Places In The World: భూమిపై మనం వెళ్ళడానికి నిషేధించబడిన టాప్ 10 ప్రదేశాలు
-
రామూ ఎవరేం చెప్పినా వినడు, ఈ జన్మలో మారడు : ఆర్జీవీ తల్లి
రామ్‌గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీకీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే అవుతుంది. అయినా ఇవేవి పట్టించుకోని వర్మ తనకు నచ్చిందే చేస్తాడు. వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆర్జీవీ ఇప్పుడు డేంజరస్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు అషూరెడ్డితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇలాంటి పనికిమాలిన ఇంటర్వ్యూలు సమాజానికి ఏం ఉపయోగకరం అంటూ చాలామంది విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. స్వయానా ఆర్జీవీ బావా కూడా ఇదే చెప్పారు. ఆర్జీవీ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంటున్నాడంటూ నిర్మొహమాటంగా పేర్కొన్నారు. తాజాగా ఆర్జీవీ తల్లి సూర్యవతి స్పందించింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. 'రామూ ఇంటికి రాగానే నేను కనిపించాలి. లేకపోతే నచ్చదు. నన్ను చూడగానే అతని కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. ఇక జీఎస్టీ సినిమాను తన పక్కనే కూర్చొని చూశాను. తనకు మారాలని అనిపిస్తేనే మారుతాడు. లేకపోతే ఎవరు చెప్పినా వినడు.. ఈ జన్మలో మారడు' అంటూ చెప్పుకొచ్చింది. -
ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు.. ‘పదవి లేదు, ఇప్పుడు మరింత..’
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను మరింత ప్రమాదకరంగా మారుతానని గురువారం హెచ్చరించారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా పెషావర్‌లో బహిరంగ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారి కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారిగా మారుతా’నని పేర్కొన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి వారం కూడా గడవకముందే ఇమ్రాన్ ఖాన్ ఇలా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం అర్ధరాత్రి దాకా న్యాయస్థానం తలుపులు తెరవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. ‘నేను న్యాయవ్యవస్థను అడుగుతున్నాను, మీరు అర్ధరాత్రి వరకు కోర్టును ఎందుకు తెరిచి ఉంచారు. ఈ దేశం నాకు 45 సంవత్సరాలుగా తెలుసు. నేను ఎప్పుడైనా చట్టాన్ని ఉల్లంఘించానా? నేను క్రికెట్ ఆడినప్పుడు ఎవరైనా నన్ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారా’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చదవండి: ఇమ్రాన్ ఖాన్ కక్కుర్తి పని బట్టబయలు పాకిస్థాన్‌లోని తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష పార్టీల సహాయంతో వాషింగ్టన్లో విదేశీ శక్తులు కుట్ర పన్నినట్లు ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. ఆదివారం నుంచి మొదలైన ప్రజల నిరసనలు ఉద్ధేశిస్తూ.. ‘మేము దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని అంగీకరించము. ఈ చర్యకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చూపించారు. ప్రతిసారీ ఒక ప్రధానమంత్రిని తొలగించినప్పుడు ప్రజలు పండగ జరుపుకుంటారు, కానీ నన్ను పదవి నుండి తొలగిస్తే ప్రజలు నిరసనలు చేస్తున్నారు’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. కాగా అనేక నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడిన విషయం తెలిసిందే. గత ఆదివారం జరిగిన జనరల్ అసెంబ్లీ అవిశ్వాస ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ ఓటమిపాలయ్యారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ రికార్డుల్లో నిలిచారు. అనంతరం పాక్‌కు 23వ ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్‌ను ఎన్నికయ్యారు. మూడు సార్లు పాక్ కు ప్రధానిగా పనిచేసిన నవాబ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ ఖాన్. చదవండి: పాక్ పీఠం షాబాజ్‌కు! ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారు? -
Traditional Chinese Medicines: చైనా మందులు మహా ప్రమాదం!
సంప్రదాయ వైద్యం ప్రపంచానికి కొత్తేం కాదు. ఆసియాలో అందునా.. చైనా సంప్రదాయ మందులకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ గిరాకీ ఉంది. ఈ తరుణంలో శాస్త్రీయ ఆధారాల్లేని ఈ మందుల గురించి భయంకరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ శాస్త్రీయతను విస్మరిస్తోందని, భద్రతా పరమైన సందేహాలకు ఇది తావిస్తోందని తాజాగా కొన్ని పరిశోధనలు బయటపెట్టాయి. న్యూయార్క్ స్టానీ బ్రూక్ యూనివర్సిటీలోని క్యాన్సర్ రీసెర్చర్ ఆర్థర్ గ్రోల్మన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. టీఎంసీ(Traditional Chinese Medicines)లో Aristolochic అనే యాసిడ్ ఉంటుందని, ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వెల్లడించారు. ‘సేఫ్టీ కన్సర్న్స్ ఆఫ్ ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ ఇంజెక్షన్స్ యూజ్డ్ ఇన్ చైనీస్’ పేరిట ఆ రీసెర్చ్ నివేదిక వెలువడింది. ముఖ్యంగా టీసీఎం ఇంజెక్షన్లు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు రీసెర్చర్లు. క్లినికల్ ట్రయల్స్ లేకుండా, పక్షపాతమైన ధోరణిలో పరిశోధనతో వాటికి అనుమతి దొరుకుతోందని, ముఖ్యంగా పిల్లలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. టీసీఎం ప్రతికూల ఔషధ ప్రతిచర్యలు.. చైనాతో పాటు నైజీరియా, టాంజానియా, సౌతాఫ్రికాలోనూ కేసులు నమోదు అవుతున్నాయని ఈ పరిశోధనలు గుర్తించాయి. హాంకాంగ్‌కు చెందిన మార్గరేట్ ఛాన్ 2006 నుంచి 2017 మధ్య డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. టీసీఎంకు జబ్బులను నయం చేసే కీలకమైన ప్రాధాన్యం ఉన్న మెడిసిన్లుగా గుర్తింపు ఇచ్చింది ఆమె. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇక చైనా సంప్రదాయ మందుల వ్యాపారం ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా నడుస్తోంది. 1972 తర్వాత అమెరికా సైతం చైనాతో ఒప్పందం చేసుకోవడంతో.. ఈ వ్యాపారం గ్లోబల్ మార్కెట్‌గా మారింది. అయితే సంప్రదాయ మందుల తయారీ పేరిట మూగ జీవాలను ముఖ్యంగా అడవి జంతువుల్ని అక్రమంగా వేటాడి చంపడంపై అభ్యంతరాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా ఆరోపణలనీ, అగ్రరాజ్యం కుట్ర అని రీసెర్చ్‌ను చైనా తోసిపుచ్చుతోంది. -
వామ్మోకరోనా.. కంటి చూపు కోల్పోతున్నారు!
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి సీరియస్ అవుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా.. ఆ కొద్దిమందిలో మాత్రం ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. గతంలో 7 నుంచి 12 రోజుల్లో ఆరోగ్యం క్షీణిస్తే.. ఇప్పుడు నాలుగైదు రోజులకే ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు చెప్తున్నారు. గతంలో పెద్ద వయసు వారిలో మాత్రమే ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతినగా.. ఇప్పుడు పెద్దవారితోపాటు యువతలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్య పరిస్థితి సీరియస్ అయి.. ఆక్సిజన్ బెడ్, వెంటిలేటర్‌పైకి వెళ్లినవారిలో కంటిచూపు దెబ్బతింటోంది. రెటీనా ఇన్ఫ్లమేషన్ కనిపిస్తోంది. ఇది కొత్త లక్షణం అని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో వారంలో 4,432 కేసులు తెలంగాణలో మార్చి 20–26 మధ్య 2,949 కరోనా కేసులు నమోదుకాగా.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు 4,432 కేసులు నమోదు కావడం గమనార్హం. గతవారం మరణాలు 19గా ఉండగా, ఈ వారం 23కు పెరిగాయి. సగటున రోజుకు నాలుగు మరణాలు నమోదవుతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. కొత్త స్ట్రెయిన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. మొదటి వేవ్‌లో 15 నిమిషాలు పాజిటివ్ రోగితో ఉంటే ఇతరులకు వైరస్ వ్యాప్తి జరిగేదని.. ఇప్పుడు నాలుగైదు నిమిషాలు ఉన్నా వ్యాపిస్తోందని స్పష్టం చేస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. ►అందరూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకుంటే వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉంటుంది. ► ఎవరికైనా పాజిటివ్ వస్తే వారి కాంటాక్టులకు లక్షణాలు లేకున్నా టెస్టులు చేయాలి. లక్షణాలు లేనివారి నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశం ఎక్కువ. ► వీలైనంత వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవాలి. టెస్టింగ్ సెంటర్లు కూడా పెరిగాయి. ► ఆఫీసుల్లోని క్యాంటీన్లు, కెఫెటేరియాల వంటి చోట మరింత జాగ్రత్తగా ఉండాలి. ► మొదటివేవ్లో కరోనా వచ్చినవారిలో ఇమ్యూ నిటీ ఉంటుంది. ఇప్పుడు వారికి వైరస్ సోకి నా లక్షణాలు కనిపించే అవకాశం తక్కువ. కేసులు పెరగడం ఆందోళనకరం సెకండ్ వేవ్‌లో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయి. కానీ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో 78 శాతం కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 14 శాతం కేసులు పెరిగాయి. దక్షిణాసియాలో నమోదైన కేసుల్లో 85 శాతం భారత్‌లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
బాబోయ్ భారత్.. లైంగిక హింసలో టాప్!
భారత్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చిన విషయమిది. దేశంలో మహిళల భద్రతకు సంబంధించిన చేదు వాస్తవమిది. మహిళల రక్షణపై తాజా సర్వే మన పరువు తీసేసింది. మహిళలకు భారతదేశమే అత్యంత ప్రమాదకరమైనదని థాంమ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యాచారాలు, లైంగిక హింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా, సెక్స్ బానిసలుగా మార్చడం, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, ఇళ్లల్లో వెట్టిచాకిరీ, భ్రూణ హత్యలు, మహిళల పట్ల అనుసరిస్తున్న అమానవీయమైన సంప్రదాయ పద్ధతులు వంటి అంశాల్లో మహిళలకు భారత్ చాలా ప్రమాదకరంగా మారిందని సర్వే తేల్చింది. నిరంతరం యుద్ధంతో అతలాకుతలమయ్యే అఫ్గానిస్తాన్, సిరియాల్లో కంటే మన దేశంలో మహిళలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలడం ఎవరికీ మింగుడు పడడం లేదు. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ రెండు, సిరియా మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో సోమాలియా, సౌదీ అరేబియా దేశాలు ఉంటే అగ్రరాజ్యం అమెరికా పదో స్థానంలో ఉంది. ఇదే సంస్థ 2011 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ సారి ఏకంగా మొదటి స్థానానికి చేరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వేలో ప్రామాణికంగా తీసుకున్న అంశాలు మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు, ఆరోగ్యం, ఆర్థిక వనరులు, లింగ వివక్ష, లైంగిక హింస–వేధింపులు, ఇతరత్రా హింసలు, అక్రమ రవాణా, సాంస్కృతికంగా, మతపరంగా వస్తున్న సంప్రదాయ పద్ధతులు వంటి అంశాలను థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ సర్వేలో ప్రామాణికంగా తీసుకుంది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాల్లోని మహిళా సమస్యలపై అధ్యయనం చేస్తున్న 548 నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. మార్చి 26–మే4 మధ్య ఆన్లైన్ ద్వారా, ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా కలుసుకొని సర్వే నిర్వహించింది. వీరంతా మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారతేనని తేల్చి చెప్పారు. కశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంప్ రేప్, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన రేపిన కల్లోలం నేపథ్యంలోనే ఈ సర్వే రావడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ అంశాల్లో భారత్ ర్యాంకింగ్ లైంగిక హింసలో మొదటి స్థానం అక్రమ రవాణాలో మొదటి స్థానం సంప్రదాయంగా వస్తున్న అనాచారాల్లో మొదటి స్థానం లింగవివక్షలో మూడో స్థానం గృహ హింస ఇతర శారీరక హింసల్లో మూడో స్థానం మహిళల ఆరోగ్య పరిస్థితుల్లో నాలుగో స్థానం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు 1. భారత్ 2. అప్గానిస్థాన్ 3. సిరియా 4. సోమాలియా 5. సౌదీ అరేబియా 6. పాకిస్తాన్ 7. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 8. యెమన్ 9. నైజీరియా 10. అమెరికా దేశానికే అవమానం : రాహుల్ గాంధీ మన ప్రధాని నరేంద్ర మోదీ తన తోటలో తిరుగుతూ యోగా వీడియోలు రూపొందించడంలో నిమగ్నమై ఉంటే, మహిళలపై అత్యాచారాలు, హింసలాంటి అంశాల్లో అఫ్గానిస్తాన్, సిరియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు మనం నేతృత్వం వహిస్తున్నాం. నిజంగా మన దేశానికి ఇదెంత అవమానం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గంటకి నాలుగు అత్యాచారాలు మన దేశంలో ఎటు చూసినా మహిళల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. 2012లో న్యూఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలకు రక్షణ కల్పించాలంటూ దేశవ్యాప్తంగా యువతీ యువకులు రోడ్డెక్కడంతో నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు. అయినప్పటికీ మహిళలపై నేరాలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. జాతీయ నేర గణాంకాల సంస్థ ప్రకారం ప్రతీ గంటకి నలుగురు మహిళలపై అత్యాచారం ప్రతీ గంటలో మహిళలపై 26 నేరాలు ప్రతీ రోజూ వందకి పైగా లైంగిక దాడి కేసులు నమోదు గంటకి అయిదుగురు మహిళల ప్రసూతి మరణాలు ప్రతీ రోజూ 21 వరకట్న మరణాలు ఏడాదికి 34,651 అత్యాచార కేసులు నమోదు మహిళలపై ఏడాదికి నమోదవుతున్న నేరాల సంఖ్య 3,27,394 దేశంలో మహిళలపై జరిగే మొత్తం నేరాల్లో ఢిల్లీ వాటా 52% 2007–16 మధ్య కాలంలో మహిళలపై నేరాల్లో పెరుగుదల 83% ఇందులో మరణాలే ఎక్కువగా ఉన్నాయి. -
ప్రమాదంతోనే స్పందిస్తారా?
కేటీదొడ్డి : మండలంలో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకొని వంగిపోవడం, వాటి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసిన విద్యుత్ స్తంభాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి ఎప్పుడు నేల కూలుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా మారిన స్తంభాలను వేలాడుతున్న తీగలను బాగుచేయాలని అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. గతంలో విద్యుత్‌స్తంభాలు నేలకొరిగి ప్రమాదాలు కూడా జరిగాయని, అంతజరిగినా.. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. తీగలు తెగిపడి.. కొన్ని రోజుల క్రితం ఎర్సందొడ్డిలో విద్యుత్ తీగలు తెగిపడి రెండు ఎద్దులు మృతిచెందాయి. మండలంలోని కొండాపురం, కేటీదొడ్డి, గువ్వలదిన్నె, నందిన్నె, కుచినెర్ల, గ్రామాల శివారులో విద్యుత్ తీగలు వేలాడుతూ విద్యుత్‌స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. గువ్వలదిన్నె స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన విద్యుత్‌స్తంభం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారాయి. స్తంభానికి మధ్యలో ఇనుపచువ్వలు పైకితేలాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌స్తంభం కూలిపోయే అవకాశం ఉందని రైతులు భయాందోళన చెందుతున్నారు. కొండాపురం గ్రామ శివారులో స్తంభాలకు విద్యుత్ తీగలు కింద నిలబడితే చేతికందేలా ఉన్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌తీగలు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అదికారులు చర్యలు తీసుకుని ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు. భయంగా ఉంది... పొలం వద్ద విద్యుత్ తీగలు చేతికందేలా ఉన్నాయి. పొలం పనులు చేసుకునేటప్పుడు భయమేస్తుంది. బలమైన గాలులు వీస్తే వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు పడుతున్నాయి. పొలం పనులు చేసుకోవాలంటే భయంగా ఉంది. తీగలు సరిచేయాలి. – యాదవరాజు, ఎర్సందొడ్డి సమస్య పరిష్కరిస్తాం.. సమస్య ఉన్న మాట వాస్తవమే. ఎర్సందొడ్డి సర్పంచ్ స్తంభాలు కావాలని మా దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే స్తంభాలు వేయిస్తాం. అలాగే కేటీదొడ్డి, నందిన్నె శివారు పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను మా లైన్మెన్కు చెప్పి తీగలు లాగేలా చూస్తాం. – పరశురాం, విద్యుత్ ఏఈ -
ఆదమరిస్తే అంతే..
కూసుమంచి : ఖమ్మం–సూర్యాపేట రహదారి పాలేరు రిర్వాయర్ పాత పార్కు వద్ద మూల మలుపులు ప్రమాదకరంగా ఉంది. రహదారి చివర భాగంలో మట్టికొట్టుకు పోయకపోవటంతో రహదారి ఎత్తుగా ఉండి వాహనాలు రోడ్డు దిగే క్రమంలో అదపుతప్పి పక్కకు దూసుకెళ్తున్నాయి. దీనికి తోడు పార్కుకు ఏర్పాటు చేసిన కంచె విరిగి ఉండటంతో వాహనాలు అందులోకి దూసుకెళ్లి గాయాల పాలవుతున్నారు. ఇటీవల ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి పార్కు లోనికి దూసుకువెళ్లి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. నిత్యం ఈప్రాంతంలో ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగునే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి క్షేత్రస్థాయిలో రహదారులను పరిశీలించి వాటికి మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
యమ'డ్రింకరులు'!
హైదరాబాద్: యమ ‘డ్రింకరులు’ యమ కింకరుల్ని మించిపోతున్నారు... పగలు, రాత్రి, చిన్నా.. పెద్దా తేడా లేకుండా మద్యం మత్తులో వాహనాలపై దూసుకుపోతున్నారు... మృత్యుశకటాలను నడిపేవారు సేఫ్‌గానే ఉంటున్నప్పటికీ ఎదుటి వారి బతుకుల్లో చీకట్లు నింపుతున్నారు... మొన్న పంజగుట్ట పరిధిలో రమ్య కుటుంబం, నిన్న హయత్‌నగర్‌లో సంజన కుటుంబం, తాజాగా మంగళవారం అర్దరాత్రి సరూర్‌నగర్ లిమిట్స్‌లోని కర్మన్‌ఘాట్ వద్ద రత్నాకర్‌రెడ్డి మద్యం మత్తులో వాహనం నడుపుతూ వచ్చి యాదగిరిని ఢీకొట్టి క్షతగాత్రుడిని చేశాడు. వీరే కాదు... రికార్డుల్లోకి ఎక్కని, ఎక్కిన ‘నిషా’చరుల బాధితులు ఇంకా ఎందరో. ఈ మందుబాబుల్ని కట్టడి చేయడంలో మాత్రం ప్రభుత్వ విభాగాలు విఫలమవుతున్నాయి. ఎస్ఓపీ లేక మరిన్ని ఇబ్బందులు... ఈ తరహా కేసుల నమోదు, దర్యాప్తులోనూ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) లేకపోవడం సైతం మందుబాబులకు అనుకూలంగా మారుతోంది. ఈ కారణంగానే పోలీసులు ఒక్కో కేసును ఒక్కో రకంగా నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేస్తున్నారు. రమ్య ప్రమాదం విషయంలో ఆ రోజు వాహనంలో ఉన్న వారంతా మద్యం తాగినప్పటికీ... కేవలం ఆ స్థితిలో వాహనం నడిపిన వ్యక్తి మీద మాత్రమే కేసు నమోదు చేశారు. సంజన విషయానికి వచ్చేసరికి అతడితో పాటు ప్రమాదానికి కారణమైన వాహనంలో ఉన్న డ్రైవర్, మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. రమ్య కేసులో నిందితుడికి బెయిల్ రావడానికి మూడు నెలల పడితే... సంజన కేసులో 24 గంటల్లోనే వచ్చింది. కఠిన చర్యలు లేకపోవడమూ... మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం సైతం ‘నిషా’చరులు పెరగడానికి ఓ కారణమవుతోంది. ప్రస్తుతం డ్రంకన్ డ్రైవ్‌లను ట్రాఫిక్ పోలీసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో చిక్కిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆపై కోర్టులో హాజరుకావల్సిందిగా ఆదేశిస్తున్నారు. అయితే అనేక ఉదంతాల్లో మందుబాబులు న్యాయస్థానాలకు వెళ్లకుండా తన వాహనాలను వదిలేస్తున్నారు. తక్కువ ఖరీదైన వాహనాల విషయంలోనే ఇలా జరుగుతోంది. ‘నిషా’చరులకు జైలు శిక్షలు, జరిమానాలు పెంచడం, వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడం, వారితో పాటు కుటుంబీకులకూ పక్కాగా కౌన్సెలింగ్ చేయడం తదితర కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితాలు ఉంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. అది మూడో కేటగిరీ వైలేషన్... ట్రాఫిక్ ఉల్లంఘనలను వాటి తీవ్రతను బట్టి అధికారులు వాటిని మూడు రకాలుగా విభజిస్తారు. మొదటిది వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరమైనవి, రెండోది ఎదుటి వారికి ప్రమాదకరమైనవి. ఈ రెంటినీ మించి తీవ్రమైన వాటిని మూడో కేటగిరీలోకి చేరుస్తారు. ఈ ఉల్లంఘనల వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం పొంచి ఉంటుంది. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి మొదటి కేటగిరీలో ఉంటే.., డ్రంకన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ తదితరాలు మూడో కేటగిరీలోకి వస్తాయి. నిరూపించడమూ పెద్ద సవాలే... మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన కేసుల్లో ‘నిరూపణలు’ కష్టసాధ్యంగా మారుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పారిపోవడం జరుగుతోంది. మళ్లీ వీరు చిక్కేప్పటికీ 24 నుంచి 48 గంటలు గడిచిపోతున్నాయి. దీంతో సదరు వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, ఆ స్థితిలో డ్రైవింగ్ చేశాడని నిరూపించడం కష్టమవుతోంది. ఒకవేళ వారు యాక్సిడెంట్ చేసిన వెంటనే చిక్కినా... మూడు కమిషనరేట్లలోనూ అవసరమైన స్థాయిలో శ్వాస పరీక్ష యంత్రాలు లేవు. ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో కొంత వరకు అందుబాటులో ఉన్నా... శాంతిభద్రతల విభాగం దగ్గర దాదాపు లేనట్లే. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు యాక్సిడెంట్ స్పాట్‌కు వెళ్లేది, ఆ కేసుల్ని దర్యాప్తు చేసేదీ శాంతిభద్రతల విభాగం పోలీసులే కావడం గమనార్హం. మద్యం మత్తులో ‘చిత్తు’ లెన్నో,.. మద్యం తాగడం కొందరికి సరదా అయితే మరెందరికో వ్యసనం. తమ ఆనందం కోసం మత్తులో జోగుతూ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా... జనం జీవితాల్నీ చిత్తు చేస్తున్నారు. ♦ లాల్‌దర్వాజకు చెందిన సాయికిరణ్ తన తల్లి అనూరాధతో కలిసి బైక్‌పై బంధువులు ఇంటికి వస్తున్నారు. పోచమ్మ ఆలయం దాటాక అడ్రస్ కనుక్కోవడం కోసం ఆగారు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీ కొట్టడంతో అనూరాధ అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని సనత్‌నగర్ పోలీసులు నిర్థారించారు. ♦ సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది రంజిత్ మద్యం తాగి తన బొలేరో వాహనంపై మితిమీరిన వేగంతో దూసుకువచ్చారు. వాహనంపై అదుపు కోల్పోవంతో బేగంపేట ఫ్లైఓవర్‌పై దిమ్మెను తాకుతూ అతి వేగంగా వచ్చి బైక్‌పై వస్తున్న రసూల్‌పురకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీకాంత్ తదితరుల్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడిక్కడే చనిపోయారు. ♦మద్యం మత్తులో ఓ వాహనచోదకుడి నిర్లక్ష్యం 18 రోజుల కాలంలో మూడు ప్రాణాలు తీయడంతో పాటు నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బంజారాహిల్స్‌లోని పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన ‘రమ్య ఉదంతం’లో రమ్యతో పాటు ఆమె బాబాయి పమ్మి రాజేష్, తాత మధుసూదనాచారి ప్రాణాలు తీయగా... తల్లి రాధికకు తీవ్రగాయాలు చేసింది. ♦ మూడు రోజుల క్రితం నగర శివార్లలోని పెద్ద అంబర్‌పేటలో జరిగిన ‘మద్యం’ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజన మృత్యువుతో పోరాడుతోంది. ఆమె తల్లి శ్రీదేవి సైతం తీవ్రంగా గాయపడ్డారు.