
రోడ్డు అంచున మట్టిపోయని దృశ్యం
కూసుమంచి : ఖమ్మం–సూర్యాపేట రహదారి పాలేరు రిర్వాయర్ పాత పార్కు వద్ద మూల మలుపులు ప్రమాదకరంగా ఉంది. రహదారి చివర భాగంలో మట్టికొట్టుకు పోయకపోవటంతో రహదారి ఎత్తుగా ఉండి వాహనాలు రోడ్డు దిగే క్రమంలో అదపుతప్పి పక్కకు దూసుకెళ్తున్నాయి. దీనికి తోడు పార్కుకు ఏర్పాటు చేసిన కంచె విరిగి ఉండటంతో వాహనాలు అందులోకి దూసుకెళ్లి గాయాల పాలవుతున్నారు. ఇటీవల ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి పార్కు లోనికి దూసుకువెళ్లి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. నిత్యం ఈప్రాంతంలో ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగునే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి క్షేత్రస్థాయిలో రహదారులను పరిశీలించి వాటికి మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

పార్కు సమీపంలో ప్రమాదకరంగా ఉన్న మూల మలుపు
Comments
Please login to add a commentAdd a comment