
రామ్‌గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీకీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే అవుతుంది. అయినా ఇవేవి పట్టించుకోని వర్మ తనకు నచ్చిందే చేస్తాడు. వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆర్జీవీ ఇప్పుడు డేంజరస్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు అషూరెడ్డితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఇలాంటి పనికిమాలిన ఇంటర్వ్యూలు సమాజానికి ఏం ఉపయోగకరం అంటూ చాలామంది విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. స్వయానా ఆర్జీవీ బావా కూడా ఇదే చెప్పారు. ఆర్జీవీ తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటున్నాడంటూ నిర్మొహమాటంగా పేర్కొన్నారు. తాజాగా ఆర్జీవీ తల్లి సూర్యవతి స్పందించింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
'రామూ ఇంటికి రాగానే నేను కనిపించాలి. లేకపోతే నచ్చదు. నన్ను చూడగానే అతని కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. ఇక జీఎస్‌టీ సినిమాను తన పక్కనే కూర్చొని చూశాను. తనకు మారాలని అనిపిస్తేనే మారుతాడు. లేకపోతే ఎవరు చెప్పినా వినడు.. ఈ జన్మలో మారడు' అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment