
పుణె: మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి తిరిగొచ్చిన ఓ యువతికి కుటుంబ సభ్యులు డప్పు వాయిద్యాలతో ఘనంగా ఆహ్వానం పలికారు. పుణెలో ఈ విశేషం వెలుగుచూసింది. ఇక కోవిడ్ చికిత్సలో భాగంగా ఇన్నాళ్లూ దూరమైన సోదరిని చూసి ఆమె చెల్లెలు రెచ్చిపోయింది. వీధిలోకి తన అక్క ఎంటరైన దగ్గర నుంచే తీన్మార్ స్టెప్పులతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. చెల్లెలి ఉత్సాహంతో పొంగిపోయిన అక్క కూడా డ్యాన్స్ చేసింది. కోవిడ్‌ను జయించిన కుమార్తెకు తల్లిదండ్రులు హారతి ఇచ్చి ఇంట్లోకి సాదరంగా తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
(చదవండి: తోపుడు బండిపై భర్త శవాన్ని..)
Comments
Please login to add a commentAdd a comment