హైదారబాద్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు.
ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది.
ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సీపీ
సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సు«దీర్‌బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చారి్మనార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి.
బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వా్కడ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని
పోలీసులు కోరుతున్నారు.
రాచకొండ పరిధిలో..
వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్‌లతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.
అదనంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు
ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల కోసం ఆరీ్టసీ, ఎంఎంటీఎస్, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టింది. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు.
సమన్వయంతో.. సమష్టిగా
– నిమజ్జనానికి ఏర్పాట్లు
సామూహిక గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, మెడికల్‌అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, టీఎస్ ఆరీ్టసీ,టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, టూరిజం విభాగాలతో పాటు 108 ఈఎంఆర్‌ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని విభాగాల అధికారుల ఫోన్‌నెంబర్లు అందరి వద్ద అందుబాటులో ఉంచారు. నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దాదాపు 3 వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తిస్తారు. విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయనున్నాయి.
మహా నిమజ్జనానికి ట్రయల్ రన్
ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం– 4 వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయని, తెల్లవారుజామున 5 గంటల నుంచి షెడ్డు తొలగించే పనులు ప్రారంభించి 7 గంటల కల్లా పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు సందీర్ రాజ్ తెలిపారు.
మినట్ టు మినట్..
మంగళవారం రాత్రి నుంచే ట్రాయిలర్ వాహనానికి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. నేటి రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాగణపతి ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపైకి తెస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా రవి క్రేన్ సాయంతో మహాగణపతిని ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్ట్ వాహనంపైకి తెస్తారు. ఉదయం 7 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు పూర్తి చేసి 9.30 గంటలకు మహా శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం–4 వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు మినట్ టు మినట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ విధంగానే ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment