Geo tagging system
-
ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్
హైదారబాద్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది. ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సీపీ సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సు«దీర్‌బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చారి్మనార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వా్కడ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రాచకొండ పరిధిలో.. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్‌లతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల కోసం ఆరీ్టసీ, ఎంఎంటీఎస్, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టింది. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు. సమన్వయంతో.. సమష్టిగా – నిమజ్జనానికి ఏర్పాట్లు సామూహిక గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెడికల్అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, టీఎస్ ఆరీ్టసీ,టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతో పాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని విభాగాల అధికారుల ఫోన్‌నెంబర్లు అందరి వద్ద అందుబాటులో ఉంచారు. నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దాదాపు 3 వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తిస్తారు. విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయనున్నాయి. మహా నిమజ్జనానికి ట్రయల్ రన్ ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం– 4 వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయని, తెల్లవారుజామున 5 గంటల నుంచి షెడ్డు తొలగించే పనులు ప్రారంభించి 7 గంటల కల్లా పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు సందీర్ రాజ్ తెలిపారు. మినట్ టు మినట్.. మంగళవారం రాత్రి నుంచే ట్రాయిలర్ వాహనానికి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. నేటి రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాగణపతి ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపైకి తెస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా రవి క్రేన్ సాయంతో మహాగణపతిని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాహనంపైకి తెస్తారు. ఉదయం 7 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు పూర్తి చేసి 9.30 గంటలకు మహా శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం–4 వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు మినట్ టు మినట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ విధంగానే ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. -
మారుమూల ఠాణాలకు టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ మరింత ఆధునిక సాంకేతికతను సంతరించుకునేందుకు కసరత్తు చేస్తోంది. మారుమూల ఠాణాలను సాంకేతికంగా బలోపేతం చేయనుంది. దీనికితోడు మరిన్ని కొత్త వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా తెలంగాణ పోలీస్ బ్రాండ్ ప్రజల్లో గుర్తుండిపోయేలా వాహనాలపై తెలంగాణ పోలీస్ లోగోతోపాటు పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇంటర్సెప్టార్ తదితర పదాలను తీర్చిదిద్దారు. నాలుగేళ్ల క్రితం రూపొందించిన ఈ బ్రాండింగ్‌లో స్వల్ప మార్పు చేయాలని లోగో పొజిషన్, స్టిక్కరింగ్ కలర్లో కొంత మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. బ్లూకోల్ట్స్ వాహనాలకు టెక్నాలజీపరంగా మార్పులు, చేర్పులు చేసి ఘటనాస్థలి నుంచే ఫొటోలు, వీడియోలు, వివరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపే విధంగా అనుసంధానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో ఠాణాల నుంచి డీజీపీ కార్యాలయానికి అనుసంధానం ఏర్పడింది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ, నిందితుల వివరాలు, ఫొటోలు.. ఇలా అన్ని క్షణాల్లో ఉన్నతాధికారుల చేతికి అందుతున్నాయి. కొనుగోలు చేసే పెట్రోలింగ్ వాహనాల్లో ట్యాబ్, జీపీఎస్ అనుసంధానం, జియో ట్యాగ్ చేసిన హాట్స్పాట్లు కనిపించేలా టఫ్ప్యాడ్లు అందుబాటులోకి రాను న్నాయి. ఏసీ సదుపాయం కలిగిన పెట్రోలింగ్ వాహనాలతో గల్లీ గస్తీని మరింత విస్తృతం చేసేందుకు అవకాశం కల్పించి ట్లు అయింది. ప్రతీ ఠాణాకు రెండు పెట్రోలింగ్వాహనాలు, 4 బ్లూకోల్ట్స్ కొత్త వాహనాలు అందించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాహనాల కొనుగోలుకు 500 కోట్లు నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల నిమిత్తం పోలీస్‌శాఖకు మరిన్ని వాహనాలు అవసరమయ్యాయి. తాజాగా ఆరు వందలకుపైగా వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతేడాది హెచ్ఐసీసీలో జరిగిన పోలీస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో మరిన్ని కార్లు, పెట్రోలింగ్ బైకులు కొనుగోలు చేస్తున్నట్టు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి. -
‘జియోట్యాగింగ్’తో అక్రమాలకు చెక్
- ఇకనుంచి ఆన్లైన్లో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి - అందుబాటులోకి కొత్త విధానం - త్వరలో గద్వాలలో అమలు గద్వాల : మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఇక నుంచి ఉండదు. ఏది నిర్మించకపోయినా బిల్లులు మంజూరు చేయిం చుకోవడం కుదరదు. పాతవాటిని చూపి కొత్తగా నిర్మించామని చెప్పినా ఎవరూ పట్టిం చుకోరు. వీటి నిర్మాణాల్లో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జియోట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గద్వాల పట్టణంలో చేపట్టనున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం తాజాగా రూ.25లక్షలు మంజూరు చేసింది. నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా నిఘా ఉంచేందుకు జియోట్యాగింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయనుంది. లబ్ధిదారులు గుంత తవ్విన నాటి నుంచి పూర్తయ్యే వరకు గల ఫొటోలు ఆన్లైన్లో అనుసంధానం చేస్తారు. దీనికోసం త్వరలో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను సైతం రూపొందించనున్నారు. పురపాలకశాఖ అధికారులు, సిబ్బంది వీటి నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెబ్సైట్లో నమోదు చేస్తారు. మరుగుదొడ్డి నిర్మించిన స్థలంతోపాటు ప్రాంతం తదితర వాటిని సైతం పరిగణలోకి తీసుకుంటారు. దీంతో లబ్ధిదారులు నిర్మించుకునే మరుగుదొడ్లు పూర్తయ్యే వరకు ఆన్లైన్లో కనిపిస్తాయి. దీంతో పాతవాటిని చూపించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. దీంతో అర్హులకు న్యాయం జరిగే అవకాశముంది. పట్టణంలో 1,100 లబ్ధిదారుల గుర్తింపు పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రక్రియలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. లబ్ధిదారులకు సంబంధించి వివరాల నమోదు నెమ్మదిగా సాగుతుండడంతో వీటి నిర్మాణాలు కొలిక్కి రావడం లేదు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం పట్టణంలో మరుగుదొడ్లు లేనివారు సుమారు రెండువేల మంది ఉన్నట్లు తేలింది. వీరికి మరుగుదొడ్ల మంజూరు పత్రాలను అందించేందుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటిదాకా 1,300మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను విచారించిన అధికారులు 1,100మంది అర్హులున్నట్లు తేల్చారు. గత నెలలో కాలనీల వారీగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. త్వరలో వీటి నిర్మాణాలను పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. చెల్లింపులు ఇలా.. ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు అందజేస్తోంది. వీటిని రెండు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. బేస్మెంట్, సెప్టిక్‌ట్యాంక్ నిర్మాణం పూర్తయితే రూ.6 వేలు, మరుగుదొడ్డి నిర్మాణం మొత్తం పూర్తయితే మరో రూ.6 వేలు అందజేయనున్నారు. త్వరలో నిర్మాణాలు పూర్తిచేస్తాం.. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి మంజూరు పత్రాలు కూడా అందజేశాం. కొన్నివార్డుల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్నివార్డుల్లో నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. -నాగేంద్రబాబు, ఇన్చార్జి కమిషనర్, గద్వాల మున్సిపాలిటీ -
‘ఇంటి’ గుట్టు.. ఇక రట్టు..!
సాక్షి, కర్నూలు : ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సర్కారు సాంకేతిక అస్త్రాన్ని సంధించబోతోంది. ప్రభుత్వ నిధులు భారీగా దిగమింగిన వారి భరతం పట్టాలని నిర్ణయించింది. పదేళ్లలో గృహ నిర్మాణ పథకంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తేనుంది. బినామీ పేర్లతో ఇళ్లు పొంది బిల్లులు తీసుకున్న వారెవరో తేలిపోనుంది. పాత ఇళ్లకే బిల్లులు మంజూరు చేయించుకున్న వారి గుట్టు రట్టుకానుంది. ఒకే ఇంటిపై రెండు మూడు బిల్లులు కాజేసిన వారి చిరునామాలూ బయట పెట్టనుంది. ఆగస్టు నుంచి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 2006-07లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 3,10,851 గృహాలు ఈ పథకం కింద నిర్మించారు. రూ. 900 కోట్లకుపైగా లబ్ధిదారులకు బిల్లుల రూపంలో చెల్లించారు. 2007-12 వరకు నిర్మించిన ఇళ్లలో రూ. 5.14 కోట్ల అవినీతి జరిగినట్లు గతంలో థర్డ్‌పార్టీ విచారణలో తేల్చారు. అది కూడా 50 మండలాల పరిధిలోని 185 గ్రామాల్లో మాత్రమే విచారిస్తే తేలిన నిజం. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అక్రమార్కుల నుంచి సొమ్ము రాబట్టాల్సి ఉండగా కేవలం రూ. 18 లక్షలు మాత్రమే వసూలు చేసినట్టు లెక్కలు చూపిస్తుండగా.. జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు నియమించిన ప్రత్యేకాధికారికి ప్రయాణ, ఖర్చుల పేరిట ఏడాది కాలంలో రూ. 15.60 లక్షలు చెల్లించడం గమనార్హం. నామమాత్రంగా చేపట్టిన సర్వేలో 5,532 మంది లబ్ధిదారులతోపాటు 206 మంది ఉద్యోగులు, 11 మంది గృహ నిర్మాణ శాఖ సిబ్బంది కలిసి అవినీతికి పాల్పడినట్టు తేలగా ఇక ‘జియో ట్యాగింగ్’ విధానం ద్వారా విచారణ మొదలు పెడితే ఎన్ని ‘అక్రమాలు’ వెలుగుచూస్తాయో చూడాలి. 2004 నుంచి 2014 వరకూ గృహ నిర్మాణాలను ఇష్టారాజ్యంగా చేపట్టారనే ఆరోపణలు ఉన్నా వెలికితీసేందుకు పటిష్ట చర్యలు తీసుకోలేదు. అక్రమాలలో అప్పటి అధికారపార్టీ నేతల హస్తం, కొందరు గృహనిర్మాణ శాఖ సిబ్బంది తప్పులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వారిపై కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. వెలుగులోకి అక్కమార్కుల అవినీతి.. గృహ నిర్మాణ పథకంలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. వాటిని వెలికి తీయడంతోపాటు, కొత్త నిర్మాణాల్లో అవినీతిని నివారించేందుకు భౌగోళిక గుర్తింపు(జియో ట్యాగింగ్) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా లబ్ధిదారుల ఇళ్లను గుర్తిస్తారు. దీని కోసం ప్రత్యేక సెల్ఫోన్లను గృహ నిర్మాణ సంస్థ అధికారులకు అందించనున్నారు. వీటి ద్వారా ముందుగానే పొందుపర్చుకున్న గృహ నిర్మాణ సంస్థ వెబ్సైట్లో లాగిన్ అయి సంబంధిత లబ్ధిదారుని ఐడీ నెంబరు పొందుపర్చుతారు. లబ్ధిదారుని పూర్తి వివరాలు వస్తాయి. తమ వద్ద ఉన్న సెల్‌ఫోనులో ఆ ఇంటి ద్వారం ఎటువైపు ఉందో ఆ వైపు నుంచి ఫొటో తీస్తారు. అనంతరం సెల్‌ఫోను నుంచే గ్లోబల్ పొజిషనింగ్ పద్ధతిలో ఉపగ్రహానికి అనుసంధానం చేస్తారు. ఆ తరువాత తీసిన ఫొటోలను ఆన్‌లైన్‌లోనూ అప్లోడ్ చేసి గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైట్‌కు పంపిస్తారు. ఒక స్థలంపై నిర్మించిన ఇంటిని అక్షాంశ, రేఖాంశాలతో గుర్తించిన తరువాత అదే స్థలంలో మరో ఇంటిని చూపించేందుకు వీలుండదు. ఒకే ఇంటిపై ఒకటి కన్నా ఎక్కువ బిల్లులు తీసుకున్న వారి ఐడీ నంబర్ల ఆధారంగా గుట్టు రట్టవుతుంది. ప్రస్తుతం గృహనిర్మాణ పథకం కింద చెల్లింపులు నిలిచిపోయాయి. బకాయిలు భారీగా పేరుకుపోయాయి. తాజా విధానం అమల్లోకి వస్తే ఇలాంటి ఇబ్బందులుండవంటున్నారు. మరో వైపు బిల్లుల కోసం అధికారులు, గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన పని ఉండదు. నిర్మాణ దశ నుంచి మరో దశకు చేరగానే ఆన్లైన్లో గుర్తించి బిల్లులు మంజూరు చేసేందుకు వీలుంటుంది. బిల్లుల కోసం లబ్ధిదారుడు తనకు కేటాయించిన ఐడీ నంబరుతో సంక్షిప్త సందేశాన్ని(ఎస్ఎంఎస్) గృహ నిర్మాణ సంస్థకు చెందిన నంబరుతో పంపితే ఆ గుర్తింపు సంఖ్యతో జిల్లాలోని ఏ గ్రామానికి చెందినదో గుర్తించి ప్రధాన శాఖ నుంచి అక్కడి సిబ్బందికి సమాచారం వెళ్తుంది. జిల్లాలో ఆగస్టు నుంచి ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.