యువరైతు ఆత్మహత్య
Published Sat, Oct 8 2016 3:02 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
మెదక్: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ సంఘటన మెదక్ మండలంలోని కుచాన్‌పల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మల్లయ్య(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో వ్యవసాయ నిమిత్తం చేసిన అప్పులు పెరిగిపోవడంతో.. గత కొన్ని రోజులుగా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement