ఇంటికి వెళ్లినా గది నుంచి బయటకు రాలేదు!  | Ex MLA Venepalli Chander Rao Refuses To Meet MLA Bollam Mallaiah Yadav | Sakshi
Sakshi News home page

ఇంటికి వెళ్లినా గది నుంచి బయటకు రాలేదు! 

Published Fri, Aug 25 2023 6:10 AM | Last Updated on Sat, Aug 26 2023 8:26 PM

Ex MLA Venepalli Chander Rao Refuses To Meet MLA Bollam Mallaiah Yadav  - Sakshi

మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు ఇంటివద్ద వేచి చూస్తున్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ 

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్‌ఎస్‌ లో అసమ్మతి చల్లారడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు ఇంట చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్‌ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చందర్‌రావుతో సర్దుబాటు చేసుకునేందుకు మల్లయ్యయాదవ్‌ గురువారం ఆయన ఇంటికి వెళ్లారు

బొల్లం వెంట అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మునగాల మండల నాయకులు సుంకర అజయ్‌కుమార్, తొగరు రమేశ్‌ తదితరులు ఉన్నారు. ఇంటిలోపలే ఉన్న చందర్‌రావు తన ఇంటికి ఎమ్మెల్యే బొల్లం వచ్చారని చెప్పినా గది నుంచి బయటికి రాలేదు. దీంతో హాల్‌లోనే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ దాదాపు 20 నిమిషాలు ఎదురుచూశారు. అప్పటికీ చందర్‌రావు బయటికి రాకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement