కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గంలో అనూహ్యంగా బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డిపై 756 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. పద్మావతిరెడ్డి పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి. ఉత్తం, పద్మావతిలు 2014లో ఇద్దరూ ఒకే అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు.
ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి గెలిస్తే పద్మావతి కోదాడలో విజయం సాదించారు. కాని 2018లో పద్మావతి ఓటమి చెందారు. పద్మావతి మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేశారు. మల్లయ్యయాదవ్‌కు 89715 ఓట్లు రాగా, పద్మావతి రెడ్డికి 88359 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన అంజియాదవ్‌కు 5200 ఓట్లు వచ్చాయి. బొల్లం మల్లయ్య సామాజిక పరంగా యాదవ వర్గానికి చెందినవారు. 2014లో నల్లమాడ పద్మావతి తన సమీప ప్రత్యర్ధి, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ది మల్లయ్య యాదవ్‌పై 13374 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
1978లో ఇక్కడ జనతా పక్షాన గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు అంతకు ముందు హుజూర్‌నగర్‌లో రెండుసార్లు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఈయన కాసు, పి.వి మంత్రివర్గాలలో పనిచేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ ఐ పక్షాన ఇక్కడ రెండుసార్లు, కొత్తగా మళ్ళీ ఏర్పడిన హుజూర్‌నగర్‌లో మూడుసార్లు గెలుపొందారు. 2019లో నల్గొండ ఎమ్.పిగా ఎన్నికవడంతో ఆయన హుజూర్ నగర్ సీటు వదలుకున్నారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఉత్తం భార్య పద్మావతి పోటీచేసి ఓడిపోయారు.
1983లో ఇక్కడ గెలిచిన వీరేపల్లి లక్ష్మీనారాయణ 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1978లో ఏర్పడిన కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి మూడు సార్లు, జనతా పార్టీ ఒకసారి, టిఆర్‌ఎస్ ఒకసారి గెలిచాయి. టిడిపి పక్షాన వేనేపల్లి చందర్‌రావు నాలుగుసార్లు గెలుపొందారు. కోదాడలో మూడుసార్లు రెడ్డి సామాజికవర్గం, నాలుగుసార్లు వెలమ, ఒకసారి కమ్మ, ఒకసారి యాదవ, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి బిసి నేత గెలిచారు.
కోదాడ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment