Nalgonda Common Districts
-
నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థుల పూర్తి వివరాలు ఇవే..
నల్గొండ నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: నల్గొండ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 2,37,951 పురుషులు: 1,16,487 మహిళలు: 1,21,326 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి: నల్గొండ తిప్పర్తి కనగల్ మాడుగులపల్లి నియోజకవర్గం ముఖచిత్రం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా నాలుగోసారి నల్గొండ నుంచి విజయం సాధించారు. గతంలో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన సమీప అభ్యర్థి భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. భూపాల్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవడంతో రాష్ట్ర స్థాయిలో ఈ నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంకట్‌రెడ్డి గెలుపుపై ధీమాతో ఉండగా.. నల్గొండలో జెండా పాతాలని గులాబీ దళం విశ్వప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఏడుసార్లు, టీడీపీ మూడుసార్లు విజయం సాధించాయి. 2018లో నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన విజయం సాధించారు. నల్గొండలో స్ట్రాంగ్ మాన్‌గా పేరొందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఆయన 23,698 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. 1999 నుంచి ఇక్కడ నుంచి వరసగా గెలుస్తున్న కోమటిరెడ్డి 2018లో ఓటమి చెందారు. భూపాల్ రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయి, 2018లో టిఆర్ఎస్లో చేరి గెలుపొందారు. భూపాల్ రెడ్డికి 98,792 ఓట్లు రాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 75,094 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మూడోస్థానం స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు వచ్చింది. ఆయనకు సుమారు మూడువేల ఓట్లు వచ్చాయి. భూపాల్ రెడ్డి సామాజికంగా రెడ్డి వర్గం నేత. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019లో లోక్ సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీ చేసి గెలుపొందడం విశేషం. నల్గొండ పట్టణంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభకు ఎన్నికైనా ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2018లో వెంకటరెడ్డి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయి, తదుపరి 2019లో ఎమ్.పిగా గెలిస్తే, రాజగోపాలరెడ్డి మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజగోపాలరెడ్డి ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా కూడా గెలిచారు. ఇద్దరు సీనియర్లు జానారెడ్డి, దామోదరరెడ్డిలను కాదని వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం విశేషం. వైఎస్ మరణం తర్వాత రోశయ్య క్యాబినెట్లో ఉన్నారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. నల్గొండలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడు సార్లు, టిడిపి మూడుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, బీఆర్ఎస్ ఒకసారి, అవిభక్త సిపిఐ ఒకసారి సిపిఎం ఒకసారి గెలుపొందగా, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 1985లో ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. హిందుపూర్, గుడివాడలతో పాటు, నల్గొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. మూడుచోట్ల ఒకేసారి గెలవడం ఒక రికార్డు. కాంగ్రెస్ నాయకుడు చకిలం శ్రీనివాస్‌రావు నల్గొండలో రెండుసార్లు, మిర్యాలగూడలో ఒకసారి గెలిచారు. ఒకసారి ఆయన లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 1962లో ఇక్కడ గెలిచిన సిపిఐ నేత ధర్మభిక్షం 1952లో సూర్యాపేటలో, 1957లో నకిరేకల్‌లో గెలిచారు. ఈయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి ఇక్కడ గెలిచిన రఘుమారెడ్డి ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా 2004లో టిడిపి పక్షాన ఇక్కడ శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, 1999లో టిడిపి పక్షాన, 2009, 2014లలో కాంగ్రెస్ ఐ పక్షాన లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరి కాలంలో ఆయన బీఆర్ఎస్లో చేరిపోయి ఎమ్మెల్సీ అయి కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. రైతు సమన్వయ సమితి అద్యక్షుడుగా కూడా వ్యవహరించారు. నల్గొండలో 12 సార్లు రెడ్లు, రెండుసార్లు బ్రాహ్మణ, ఒకసారి గౌడ్, ఒకసారి ఎస్.సి, ఒకసారి కమ్మ సామాజికవర్గాలు ఎన్నికయ్యాయి. -
నల్గొండ: రాజకీయ ముఖచిత్రం.. పూర్తి వివరాలు
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిగా విడగొట్టబడ్డాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాగా ఉన్న సమయంలో జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండేవి. ఇందులో రెండు ఎస్సీలకు ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగతా 9 నియోజకవర్గాలు జనరల్‌కు కేటాయించబడ్డాయి. ఎస్సీలకు కేటాయించబడిన నియోజకవర్గాలు: నకిరేకల్( నల్లగొండ జిల్లా), తుంగతుర్తి( సూర్యాపేట జిల్లా) ఎస్టీలకు కేటాయించబడిన నియోజకవర్గం: దేవరకొండ( నల్లగొండ జిల్లా) ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా సూర్యాపేటలో నాలుగు నియోజకవర్గాలు, యాదాద్రిలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల వివరాలు నల్లగొండ మిర్యాలగూడ నాగార్జునా సాగర్ నకిరేకల్(ఎస్సీ) మునుగోడు దేవరకొండ(ఎస్టీ) సూర్యాపేట జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వివరాలు సూర్యాపేట కోదాడ తుంగతుర్తి(ఎస్సీ) హుజూర్ నగర్ యాదాద్రి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు భువనగిరి ఆలేరు ► మొత్తం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. మరో 6 నియోజకవర్గాల్లో మాత్రం పురుష ఓటర్లు మహిళల కంటే ఎక్కువగా ఉన్నారు. ► నల్లగొండ, సూర్యాపేట, హూజూర్ నగర్, కోదాడ, నాగార్జునా సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారు. ► దేవరకొండ, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 26,87,818 మంది. ఈ సంఖ్య గతేడాది కంటే 11,399 మంది ఓటర్లు తక్కువగా ఉన్నారు. వయస్సుల వారిగా ఓటర్ల సంఖ్య: 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్లు నల్లగొండ: 17562 సూర్యాపేట: 9734 యాదాద్రి: 23750 20 నుంచి 29 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న ఓటర్ల సంఖ్య నల్లగొండ: 254468 సూర్యాపేట: 157652 యాదాద్రి: 116685 -
తుంగతుర్తి: పటిష్టంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదా?
తుంగతుర్తి నియోజవర్గం 1957లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మల్లు స్వరాజ్యం రెండు సార్లు విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం నియోజకవర్గంపై తన మార్కు చూపించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం కూడా తిరుమలగిరి మండలమే. మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి స్వస్థలం కూడా నాగారమే. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి అత్యధికంగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1985, 1989, 1994లో దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 1999లో మాత్రం సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత మరోసారి 2004లో గెలిచారు. 2009లో ఇది ఎస్సీ రిజర్వుడు అయింది. రిజర్వుడుగా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో 2009 మోత్కుపల్లి నర్సింహులు గెలిచారు. 2014, 18లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరపున ఆయనకే టికెట్ దక్కింది. అభివృద్ది చేసినా.. ప్రతిపక్షాలకు చిక్కేలా బీఆర్ఎస్? తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పథాన నడిచిందనే వాదన ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్లే మూసీ, బిక్కేరు వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక తరలివెళ్తోంది. ఇసుక కూడా ఎన్నికల ప్రధాన విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలకు మారే అవకాశం ఉంది. దీనికి తోడు ఇసుక లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన కిషోర్ ఆధిక్యం మూడు వేలు దాటలేదు అంటేనే పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కిషోరే మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై నేతలతో పాటు ఆ పార్టీ అధిష్టానానికి కూడా క్లారిటీ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి వడ్డేపల్లి రవితో పాటు గతంలో పోటీ చేసి ఓడిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య మరోసారి పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పాల్వాయి రజిని కూడా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా ఓటర్లు : నియోజకవర్గంలో ఒకప్పుడు సాగునీటి కొరత ఉండేది. కానీ వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటి కొరత తీరడంతో పాటు ప్రస్తుతం కాళేశ్వరం జలాలు కూడా వస్తుండటంతో రెండు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా అధికంగా ఉంటారు. మరోవైపు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇక తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా ఉంది. మతం/కులాల వారిగా ఓటర్లు : ఇక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే అధికంగా ఉంటారు. దాదాపు 45 నుంచి 50 వేల వరకు వారే ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. ఈ తర్వాత యాదవ, గౌడ, ముప్పై వేల చొప్పున ఎస్టీ లంబాడకు 18 వేలు ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ 18 నుంచి 20 వేల వరకు ఓట్లు ఉంటాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో విశాలమైన రహదారులు ఉన్న నియోజకవర్గం ఇదే. ఇక్కడి నుంచి పలు జాతీయ రహదారులు వెళ్తుంటాయి. మూసీ, బిక్కేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం పణిగిరి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. సూర్యదేవాలయంతో పాటు ప్రసిద్ధి గాంచిన రామ, శివాలయాలకు పెట్టిన పేరు. పణిగిరి క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి బౌద్దులు వస్తుంటారు. కానీ దాన్ని మరింత కాపాడాల్సిన అవసరం ఉంది. -
కాంగ్రెస్, టీడీపీకి బీఆర్ఎస్ బ్రేక్.. కోదాడలో ఉత్కంఠ పోరు?
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కోదాడ ఒకటి. తెలంగాణ సరిహద్దు సెగ్మెంట్ అయిన కోదాడలో ఏపీ రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో టిల్లర్ల ఓటు బ్యాంక్ ప్రభావం ఉన్న నియోజకవర్గం ఇది. ఏపీ, తెలంగాణకు ఎక్కువగా రాకపోకలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాలు కలిసిన వాతావరణం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడ తెలంగాణవాదం తక్కువే. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు చెరో ఐదు సార్లు గెలిచారు. కానీ ఫస్ట్‌టైం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచారు... కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలకు బీఆర్ఎస్ బ్రేక్: నిజానికి కోదాడ నియోజకవర్గం మొదట కాంగ్రెస్‌కు.. తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు బీఆర్ఎస్లో చేరారు. ఆయన తర్వాత.. బొల్లం మల్లయ్య యాదవ్ కూడా సైకిల్ దిగి కారెక్కారు. దాంతో టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్లింది. దాంతో మల్లయ్య యాదవ్ తొలిసారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. గెలుపు జెండా ఎగరేశారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు : ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నట్లు కనిపించినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకే మరోసారి టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్తమ్ పద్మావతీ పోటీ చేయనున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో రెండు పదవులు అంశం తెరపైకి వస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి నూకల పద్మారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ నియోజవర్గం నుంచి వెళ్తున్నా మోతే లాంటి ప్రాంతాలకు చివరి భూములకు నీరు అందడం లేదని అక్కడి రైతులు మండిపడుతున్నారు. ఇక కోదాడలో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురికావడం కబ్జా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ కబ్జాలను అడ్డుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్తు టాక్ నడుస్తోంది. మరోవైపు దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం కూడా పెను దుమారాన్ని లేపింది. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ ప్రధానంగా రైతులు, వ్యాపారంపైనే అధికంగా ఆధారపడి ఉంటారు. రైసు మిల్లులు కూడా అధికంగా ఉంటాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో సెటిలర్స్ కూడా ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నిర్ణాయాత్మక పాత్రను పోషిస్తుందని లెక్కలు చెప్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి 32427 ఓట్లు, రెడ్డి 24365, గౌడ 22673 , లంబాడా19988, యాదవ్ కులస్తులు -16473, మల 11673, కమ్మ 11628, ముదిరాజ్ 9961, పెరిక 9384, ముస్లీం 8 వేలు భౌగోళిక పరిస్థితులు.. ఆలయాలు : కోదాడ మండలం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడకు ఇరు రాష్ట్రాల నుంచి వేలాదిగా నిత్యం భక్తులు వస్తుంటారు. అనంతగిరి మండలం గొండ్రియల రామాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మునగాల మండలం రేపాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బరకత్ గూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయం. నదులు : ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. -
మరోసారి బరిలో సైదిరెడ్డి.. హుజూర్‌నగర్‌లో ఉత్కంఠత!
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2007లో ఏర్పడింది. 2009, 2014, 18లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణిని బరిలో దించారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఆమె ఓటమిపాలైంది. ఈసారి జరిగే పోరు మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో డబ్బే కీలక పాత్ర పోషించనుంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నేతలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం అయిన నేపథ్యంలో గెలిచేందుకు ధన ప్రవాహం కొనసాగించే అవకాశం ఉంది. దీనికి తోడు అభివృద్ధి, ప్రతిపక్షాలు చేస్తున్న భూ ఆక్రమణలు కూడా భూమిక పోషించనున్నాయి. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు: ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి రేసులో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ రైతులతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు అధికంగా ఉంటారు. రాష్ట్రంలోనే అత్యధిక సిమెంట్ పరిశ్రమలు ఉన్న నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ ఒకటి. ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో వేలాది మంది యువత ఉపాధి పొందుతున్నారు. కులం పరంగా ఓటర్లు : ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గపు ఓటర్లే అధికంగా ఉంటారు. ఆ తర్వాత ఎస్టీ లంబాడీ వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి 27712 మంది, లంబాడీ 26039, గౌడ 16838, యాదవ16530, మున్నురుకాపు 13173, ముదిరాజ్ 13228, కమ్మ 11071 మంది ఉంటారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు: ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ పయనిస్తుంది. సాగర్ ఆయకట్టు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉంటుంది. దీనికి తోడు అత్యధిక సిమెంట్ పరిశ్రమలకు అడ్డగా ఉంది. మరోవైపు కృష్ణపట్టే ప్రాంతం ఉంటుంది. ఇక రంగురాళ్లు ఎక్కువగా లభిస్తాయన్న ప్రచారం సైతం ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. చారిత్రక మఠంపల్లి స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్న ప్రాంతం. మేళ్ల చెరువులో ఉన్న శివాలయానికి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు వస్తారు. నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దులో ఉంది. ఇక్కడి నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. -
సూర్యాపేటలో ఆ సెంటిమెంట్! బీఆర్ఎస్కు హ్యాట్రిక్ సాధ్యమేనా?
ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ. నాలుగుసార్లు టీడీపీ, చెరో రెండు సార్లు సీపీఐఎం, బీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి. తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐఎం అభ్యర్థి ఉప్పల మల్సూర్ ఎన్నికయ్యారు. 2004 వరకు ఎస్సీ రిజర్వుడుగా ఉన్న సూర్యాపేట 2009లో జనరల్‌గా మారింది. 2009లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించగా ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ నేత కూడా మూడోసారి విజయం సాధించిన దాఖలాలు లేవు. 1962, 67లో ఉప్పల మల్సూర్ రెండు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఆకారపు సుదర్శన్ కూడా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఉన్న జగదీష్ రెడ్డి కూడా 2018 గెలుపుతో రెండోసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి గత చరిత్రను ఆయన తిరగరాసి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అవుతారా లేక గతమే రిపీట్ అవుతుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇక్కడ ప్రధానంగా అభివృద్ధే ఎన్నికలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజ్ ఏర్పాటు, జిల్లాకు నూతన కలెక్టరేట్, రోడ్ల విస్తరణ పనులు, సమీకృత మార్కెట్ నిర్మాణంతో పాటు సద్దల చెరువును ట్యాంక్ బండ్‌గా మార్చడంతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కొందరు కింది స్థాయి బీఆర్ఎస్ నేతల తీరు కూడా రాజకీయంగా ఆ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. మూసీ కాలువల ఆధునికీకరణ చేయాల్సి ఉంది. దీనికి తోడు సద్దల చెరువు పొంగితే దిగువన ఉన్న కాలనీ వాసులు ముంపుకు గురవుతున్నారు. ఈ సమస్యకు శాశ్యత పరిష్కారం చూపించాల్సి ఉంది. ఉండ్రుగొండను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు : ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ కేబినేట్లో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయనకు పోటీగా బీఆర్ఎస్ నుంచి మరో నేత కనిపించడం లేదు. అయితే కొందరు నేతల్లో మాత్రం అంతర్గతంగా అసంతృప్తిని వెలుబుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అని చెప్పుకునే ఓ నేత మంత్రికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైరి పార్టీకి చెందిన కీలక నేతతో సమావేశం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూరా నర్సయ్య, వెంకటేశ్వరరావు కుమారుడు వరుణ్ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులాల పరంగా ఓటర్లు: ► నియోవజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. ► సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైశ్యతో పాటు రెడ్డి సామాజికవర్గపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ► ఆత్మకూరు ఎస్ మండలంలో రెడ్డి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు నిర్ణాయాత్మక శక్తిగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : ఇక్కడ ప్రధాన నది మూసీ. సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాల గుండా మూసీ నది ప్రవహిస్తోంది. ఇక ఎస్సారెస్పీ కాలువ ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు అందుతుంది. పర్యాటకం : చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో జరిగే లింగమంతుల జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్దది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి గుట్టపై నెలకొని ఉన్న లింగమంతుల స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఈ జాతర మూడు రోజల పాటు సాగుతుంది. ఇక ఆరువేల ఏళ్ల చరిత్ర ఉన్న ఉండ్రుగొండ గుట్టలు కూడా సూర్యాపేటకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆలయాలు : ఇక్కడ స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడకు భారీ ఎత్తున భక్తులు వస్తారు. ఇక వందల ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి దేవాలయంతో పాటు అంతే ప్రాచుర్యం పొందిన శివాలయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. -
తుంగతుర్తి నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్ ఎవరు..?
తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి రిజర్వుడు నియోజకవర్గంలో విద్యార్ది నేత గాదరి కిషోర్ రెండోసారి విజయం సాదించారు. ఆయన కాంగ్రెస్ ఐ అభ్యర్ది అద్దంకి దయాకర్ ను ఓడిరచారు. దయాకర్ కూడా తెలంగాణ ఉద్యమంలో జెఎసిలో ప్రముఖ పాత్ర పోషించినవారిలో ఒకరుగా ఉన్నారు. కిషోర్ కు 1847 ఓట్ల ఆదిక్యత వచ్చింది.కిషోర్ కు 90857 ఓట్లు రాగా,అద్దంకి దయాకర్ కు 87010 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్.ఎప్ బి తరపున పోటీచేసిన అనిల్ కు 3700 పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2014లో కూడా కిషోర్, దయాకర్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.కిషోర్ 2379 ఓట్ల ఆధిక్యతతో దయాకర్ పై గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేత,2009లో తుంగతుర్తిలో గెలిచిన మోత్కుపల్లి నర్శింహులు 2014లో తుంగతుర్తిలో పోటీచేయకుండా ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓటమి చెందారు. మోత్కుపల్లి ఆలేరులో ఐదుసార్లు, తుంగతుర్తిలో ఒకసారి గెలుపొందారు. నర్శింహులు నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి కాంగ్రెస్ ఐ తరుపున, మరోసారి ఇండిపెండెంటుగా గెలిచారు. ఈయన గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తుంగతుర్తిలో సిపిఎం మూడుసార్లు, కాంగ్రెస్ఐ మూడుసార్లు, టిడిపి రెండుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు విజయం సాధించగా ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి తుంగతుర్తిలో ఒకసారి సూర్యాపేటలో మరోసారి గెలిచారు. మిర్యాలగూడ నుంచి ఈయన మూడుసార్లు లోక్‌సభకు గెలిచారు. తర్వాత కాలంలో సిపిఎం వదలి సొంతపార్టీని ఏర్పాటుచేసుకున్నారు. సిపిఎం నేత, భీమ్‌రెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం రెండుసార్లు గెలిచారు. ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెలుపొందిన రామిరెడ్డి దామోదరరెడ్డి 2009లో సూర్యాపేటలో విజయం సాధించారు. కాని 2014, 2018లలో అక్కడే ఓటమి చెందారు. దామోదరరెడ్డి 1992లో నేదురుమల్లి క్యాబినెట్లో, 2009 వరకు డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లోను ఉన్నారు ఈయన సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు శాసనసభకు గెలుపొందారు. ఆయన కూడా 2009-2014 మద్య మూడు క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. తుంగతుర్తి రిజర్వుడ్ కాకముందు ఎనిమిదిసార్లు రెడ్లు, ఒకసారి వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు
నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో రామన్నపేట నియోజకవర్గం రద్దై నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. నకిరేకల్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన చిరుమర్తి లింగయ్య రెండోసారి విజయం సాదించారు. ఆయన గతంలో 2009లో ఒకసారి, తిరిగి 2018లో మరోసారి గెలిచారు. లింగయ్య తన సమీప ప్రత్యర్ది, సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై 8259 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఆ తర్వాత కొద్ది కాలానికి లింగయ్య కాంగ్రెస్ ఐకి గుడ్ బై చెప్పి అదికార టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. లింగయ్యకు 93699 ఓట్లు రాగా, వీరేశంకు 85440 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్దిగా పోటీచేసిన డి.రవికుమార్‌కు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. నకిరేకల్ నియోజకవర్గంలో 2014లో టిఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ది చిరుమర్తి లింగయ్యను 2370 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఇక్కడ టిఆర్ఎస్కు రాజీనామా చేసిన చెరుకు సుధాకర్ తన భార్య లక్ష్మిని బిజెపి పక్షాన రంగంలో దించినా ప్రయోజనం దక్కలేదు. ఆమెకు38440 ఓట్లు వచ్చాయి. సిపిఎం పక్షాన పోటీచేసిన ఎమ్.సర్వయ్యకు 12741 ఓట్లు వచ్చాయి. 2018లో లింగయ్య గెలవగలిగారు. నకిరేకల్ నియోజకవర్గంలో సిపిఐ ఒకసారి, సిపిఎం ఎనిమిదిసార్లు, కాంగ్రెస్ కాంగ్రెస్‌లు మూడుసార్లు, టిఆర్ఎస్, పిడిఎఫ్ ఒక్కొక్కసారి గెలుపొందాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నకిరేకల్ రిజర్వుడ్ కేట గిరిలోకి వెళ్లింది. అంతకు ముందు జనరల్‌గా ఉన్నప్పుడు సిపిఎం నేత నర్రా రాఘవరెడ్డి ఇక్కడ నుండి ఆరుసార్లు గెలిచారు. టిడిపి ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. సిపిఎం నేత నోముల నరసింహయ్య ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2009లో భువనగిరి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2014లో టిఆర్ఎస్లో చేరి సాగర్ నుంచి పోటీచేసి ఓడినా, 2018లో గెలవగలిగారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సిపిఎం నకిరేకల్‌లో పట్టు నిలబెట్టుకున్నా, 2009 నుంచి ఓడిపోతోంది. 1957లో ఇక్కడ గెలిచిన ధర్మభిక్షం నల్గొండలో, సూర్యాపేటలలో కూడా గెలిచారు. ఈయన రెండుసార్లు లోక్‌సభకు కూడా గెలుపొందారు. నకిరేకల్ రిజర్వుడ్ కాకముందు ఏడుసార్లు రెడ్లు, నాలుగుసార్లు బిసిలు (రెండుసార్లు గౌడ, రెండుసార్లు యాదవ) ఎన్నికయ్యారు. రామన్నపేటలో (2009లో రద్దు) 1952లో ఏర్పడిన రామన్నపేట శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 13సార్లు ఎన్నికలు జరగ్గా, పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, సిపిఐ నాలుగుసార్లు గెలుపొందాయి. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి శాసనసభకు రెండుసార్లు గెలిచారు. 1999, 2004లలో ఆయన గెలుపొందారు. ఆయన శాసనమండలి సభ్యునిగా ఎక్కువ కాలం ఉన్నారు. పురుషోత్తంరెడ్డి 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలోను, 1973లో జలగం వెంగళరావు క్యాబినెట్‌లోను సభ్యునిగా ఉన్నారు. కొమ్ము పాపయ్య 1981లో టి.అంజయ్య మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు.సిపిఐ నేతలు కె.రామచంద్రారెడ్డి, జి.యాదగిరిరెడ్డిలు మూడేసి సార్లు అసెంబ్లీకి గెలిచారు. రామన్నపేట లో ఎనిమిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు ఎస్.సిలు ఎ న్నికయ్యారు. నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంని జయించేది ఎవరు?
భువనగిరి నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన పైళ్ల శేఖర్ రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది కుంభా అనిల్‌కుమార్ రెడ్డిపై 24063 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉన్న ఈ ప్రాంతం నుంచి టిఆర్ఎస్ తేలికగా గెలించింది. కాగా ఇక్కడ యువ తెలంగాణ పార్టీ పక్షాన పోటీచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి 13400 పైచిలుకు ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డికి 84898 ఓట్లు రాగా, అనిల్ కుమార్ రెడ్డికి 60556 ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గం నేత. 1985 నుంచి భువనగిరిలో అప్రతిహతంగా విజయ దుంధుభి మోగిస్తున్న తెలుగుదేశం పార్టీ 2014లో తొలిపారి ఓడిపోయింది. మాజీ మంత్రి, దివంగత నేత ఎ.మాధవరెడ్డి, ఆయన భార్య ఉమ మూడు దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతి నిద్యం వహించారు. 2014లో టిఆర్ఎస్ నేత పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరిలో విజయం సాధించారు. విశేషం ఏమిటంటే ఆయన సమీప ప్రత్యర్ధిగా స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి కావడం. శేఖర్‌రెడ్డి 15416 ఆధిక్యతతో గెలిచారు. ఉమా మాధవరెడ్డికి 24569 ఓట్లు వచ్చాయి. ఆమె ఇక్కడ రెండో స్థానంలో కూడా లేరు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉండడం కూడా కారణం కావచ్చు. మాధవరెడ్డి నాలుగుసార్లు విజయం సాధిస్తే ఆయన భార్య ఉమా మాధవరెడ్డి మూడుసార్లు గెలుపొందారు. 1999 ఎన్నికల తర్వాత నక్సల్ ఘాతుకానికి మాధవరెడ్డి బలైపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలోను, 2004, 2009లలో ఉమా మాధవరెడ్డి గెలిచారు. మాధవరెడ్డి గతంలో ఎన్.టి.ఆర్, ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేశారు. ఉమ కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. భార్యభర్తలిద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. భువనగిరి, ఆలేరులలో గతంలో గెలుపొందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవిలు రెండుసార్లు గెలుపొంది శాసన సభ్యులుగా ఉండడం మరోరికార్డు. రామచంద్రారెడ్డి ఒకసారి మెదక్‌జిల్లా నుంచి, ఒకసారి ఇక్కడ నుంచి గెలవగా, కమలాదేవి ఆలేరు నుంచి మూడుసార్లు గెలిచారు. భువనగిరిలో పిడిఎఫ్ రెండుసార్లు, సిపిఐ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందగా, టిడిపి ఏడుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. కేంద్ర మాజీ మంత్రి ఎ. నరేంద్ర 2004లో ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా జిట్టా బాలకృష్ణరెడ్డి 2009లో టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో ఉండగా, 2014, 2018లలో స్వతంత్రుడిగా పోటీచేశారు. తెలంగాణ పోరాట యోధుడు, కమ్యూనిస్టు పార్టీ నేత రావి నారాయణరెడ్డి భువనగిరిలో రెండుసార్లు గెలిచారు. 1952లో ఈయన ఒకేసారి లోక్‌సభకు, అసెంబ్లీకి గెలుపొందారు. తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కొండా లక్ష్మణ్‌బాపూజీ మరో రెండుసార్లు చినకొండూరులో గెలిచారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కూడా ఒకసారి విజయం సాధించారు. ఈయన దామోదరం సంజీవయ్య, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. భువనగిరిలో పద్నాలుగుసార్లు రెడ్లు గెలుపొందితే, రెండుసార్లు పద్మశాలి, ఒకసారి ఎస్.సి వర్గం నేతలు గెలుపొందారు. భువనగిరి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మునుగోడు నియోజకవర్గ చరిత్రను ఎవరు తిరగరాస్తారు..?
మునుగోడు నియోజకవర్గం మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది కె. ప్రభాకరరెడ్డిపై 22552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి. రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో పాల్వాయి గోవర్దనరెడ్డి పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఐ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు, పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు.ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. మునుగోడు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నల్గొండ నియోజకవర్గం తదుపరి అభ్యర్థి..?
నల్గొండ నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన విజయం సాదించారు. నల్గొండలో స్ట్రాంగ్ మాన్‌గా పేరొందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆయన 23698 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. 1999 నుంచి ఇక్కడ నుంచి వరసగా గెలుస్తున్న కోమటిరెడ్డి 2018లో ఓటమి చెందారు. భూపాల్ రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయి, 2018లో టిఆర్ఎస్లో చేరి గెలుపొందారు. భూపాల్ రెడ్డికి 98792 ఓట్లు రాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 75094 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మూడోస్థానం స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన వెంకటేశ్వర్లుకు వచ్చింది. ఆయనకు సుమారు మూడువేల ఓట్లు వచ్చాయి. భూపాల్ రెడ్డి సామాజికంగా రెడ్డి వర్గం నేత. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019లో లోక్ సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. నల్గొండ పట్టణంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభకు ఎన్నికైనా ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2018లో వెంకటరెడ్డి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయి, తదుపరి 2019లో ఎమ్.పిగా గెలిస్తే, రాజగోపాలరెడ్డి మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజగోపాలరెడ్డి ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా కూడా గెలిచారు. ఇద్దరు సీనియర్లు జానారెడ్డి, దామోదరరెడ్డిలను కాదని వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం విశేషం. వైఎస్ మరణం తర్వాత రోశయ్య క్యాబినెట్లో ఉన్నారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. నల్గొండలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడు సార్లు, టిడిపి మూడుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, అవిభక్త సిపిఐ ఒకసారి సిపిఎం ఒకసారి గెలుపొందగా, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 1985లో ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. హిందుపూర్, గుడివాడలతో పాటు, నల్గొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. మూడుచోట్ల ఒకేసారి గెలవడం ఒక రికార్డు. కాంగ్రెస్ నాయకుడు చకిలం శ్రీనివాసరావు నల్గొండలో రెండుసార్లు, మిర్యాలగూడలో ఒకసారి గెలిచారు. ఒకసారి ఆయన లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 1962లో ఇక్కడ గెలిచిన సిపిఐ నేత ధర్మభిక్షం 1952లో సూర్యాపేటలో, 1957లో నకిరేకల్‌లో గెలిచారు. ఈయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి ఇక్కడ గెలిచిన రఘుమారెడ్డి ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా 2004లో టిడిపి పక్షాన ఇక్కడ శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, 1999లో టిడిపి పక్షాన, 2009,2014లలో కాంగ్రెస్ ఐ పక్షాన లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరి కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయి ఎమ్మెల్సీ అయి కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. రైతు సమన్వయ సమితి అద్యక్షుడుగా కూడా వ్యవహరించారు. నల్గొండలో 12 సార్లు రెడ్లు, రెండుసార్లు బ్రాహ్మణ, ఒకసారి గౌడ్, ఒకసారి ఎస్.సి, ఒకసారి కమ్మ సామాజికవర్గాలు ఎన్నికయ్యాయి. నల్గొండ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సూర్యాపేట నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...
సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేటలో టిఆర్ఎస్ పక్షాన మరోసారి పోటీచేసిన మంత్రి జగదీష్ రెడ్డి విజయం సాదించారు. దీంతో ఆయన రెండుసార్లు గెలిచినట్లు అయింది. ఆ తర్వాత మళ్లీ కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. జగదీష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి ఆర్. దామోదరరెడ్డిపై 5941 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. జగదీస్ రెడ్డికి 66742 ఓట్లు రాగా, దామోదరరెడ్డికి 60801ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుకు 39 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. జగదీష్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో జగదీష్ రెడ్డి సూర్యాపేటలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుపై 2219 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ ఐ నేత దామోదర రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. సంకినేని గతంలో తుంగతుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. దామోదరరెడ్డి తుంగతుర్తిలో నాలుగుసార్లు, సూర్యాపేటలో ఒకసారి గెలుపొందారు. ఈయన ఒకసారి ఇండిపెండెంటుగా గెలవగా, మిగిలిన నాలుగుసార్లు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 1992లో నేదురుమల్లి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా 2007 నుంచి పనిచేశారు. 2009లో గెలిచిన తర్వాత ఈయనకు పదవి దక్కలేదు. ఈయన సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి గెలుపొందారు. వెంకటరెడ్డికి మంత్రి అవకాశం దక్కడంతో ఈయనకు ఛాన్స్ రాలేదు. సూర్యాపేట నుంచి పిడిఎఫ్ మూడుసార్లు, సిపిఐ ఒకసారి, సిపిఎం ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ రెండు సార్లు గెలిచాయి. కడవరకు అతి సామాన్య జీవితం గడిపి ఎందరికో ఆదర్శప్రాయుడు అనిపించుకున్న ఉప్పుల మన్సూర్ సూర్యాపేటలో నాలుగుసార్లు గెలిచారు. టిడిపి నేత ఆకారపు సుదర్శన్ రెండుసార్లు శాసనసభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1952లో ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఎన్నికైన బొమ్మగాని ధర్మభిక్షం తర్వాత నకిరేకల్‌లో 1957లో, నల్గొండలో 1962లో గెలిచారు. 1957లో ఇక్కడ గెలిచిన భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి 1967లో తుంగతుర్తిలో కూడా గెలిచారు. బీమ్‌రెడ్డి మూడుసార్లు లోక్‌సభకు మిర్యాలగూడెం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో ఆయన సిపిఎంను వదలి సొంత పార్టీని పెట్టుకున్నారు. సిపిఐ నాయకుడు దర్మభిక్షం రెండుసార్లు నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సూర్యాపేట నాలుగుసార్లు రెడ్లు, ఒక గౌడ్ నేత ఎన్నికయ్యారు. మిగిలినసార్లు ఇది రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉంది. సూర్యాపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కోదాడ నియోజకవర్గం ఘన చరిత్ర..ఇదే
కోదాడ నియోజకవర్గం కోదాడ నియోజకవర్గంలో అనూహ్యంగా బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టిడిపి నుంచి టిఆర్ఎస్లోకి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డిపై 756 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. పద్మావతిరెడ్డి పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి. ఉత్తం, పద్మావతిలు 2014లో ఇద్దరూ ఒకే అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్ నుంచి గెలిస్తే పద్మావతి కోదాడలో విజయం సాదించారు. కాని 2018లో పద్మావతి ఓటమి చెందారు. పద్మావతి మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేశారు. మల్లయ్యయాదవ్‌కు 89715 ఓట్లు రాగా, పద్మావతి రెడ్డికి 88359 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన అంజియాదవ్కు 5200 ఓట్లు వచ్చాయి. బొల్లం మల్లయ్య సామాజిక పరంగా యాదవ వర్గానికి చెందినవారు. 2014లో నల్లమాడ పద్మావతి తన సమీప ప్రత్యర్ధి, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ది మల్లయ్య యాదవ్‌పై 13374 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 1978లో ఇక్కడ జనతా పక్షాన గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు అంతకు ముందు హుజూర్‌నగర్‌లో రెండుసార్లు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఈయన కాసు, పి.వి మంత్రివర్గాలలో పనిచేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ ఐ పక్షాన ఇక్కడ రెండుసార్లు, కొత్తగా మళ్ళీ ఏర్పడిన హుజూర్‌నగర్‌లో మూడుసార్లు గెలుపొందారు. 2019లో నల్గొండ ఎమ్.పిగా ఎన్నికవడంతో ఆయన హుజూర్ నగర్ సీటు వదలుకున్నారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఉత్తం భార్య పద్మావతి పోటీచేసి ఓడిపోయారు. 1983లో ఇక్కడ గెలిచిన వీరేపల్లి లక్ష్మీనారాయణ 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1978లో ఏర్పడిన కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి మూడు సార్లు, జనతా పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెలిచాయి. టిడిపి పక్షాన వేనేపల్లి చందర్రావు నాలుగుసార్లు గెలుపొందారు. కోదాడలో మూడుసార్లు రెడ్డి సామాజికవర్గం, నాలుగుసార్లు వెలమ, ఒకసారి కమ్మ, ఒకసారి యాదవ, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి బిసి నేత గెలిచారు. కోదాడ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
హుజూర్నగర్ నియోజకవర్గం తదుపరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?
హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గంలో పిసిసి అద్యక్షుడు, మాజీ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి 2018లో ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో కోదాడ నుంచి రెండుసార్లు, తదుపరి హుజూర్నగర్ నుంచి వరసగా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తంకుమార్ రెడ్డి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిపై 7466 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. 2019లో ఉత్తం కుమార్ రెడ్డి లోక్ సభకు ఎన్నిక కాగా, హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ది సైదిరెడ్డి భారీ ఆదిక్యతతో గెలిచారు. అప్పుడు ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి ఓటమి చెందారు. అంతకుముందు 2014లో ఆమె కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో కోదాడలో ఓడిపోయిన తర్వాత హుజూర్‌నగర్‌లో మళ్లీ రంగంలో దిగి ఓటమి చెందారు. తెలంగాణలో 2014 ఎన్నికల తర్వాత ఉత్తం కుమార్ రెడ్డి పిసిసి అద్యక్షుడు అయ్యారు. కాంగ్రెస్ గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అదికారంలోకి రాలేకపోయింది. 2018 సాదారణ ఎన్నికలో ఉత్తంకుమార్‌రెడ్డికి 92996 ఓట్లు రాగా, సైదిరెడ్డికి 85530 ఓట్లు వచ్చాయి. సైదిరెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2019 ఉప ఎన్నికలో సైదిరెడ్డికి 43358 ఓట్ల ఆదిక్యత వచ్చింది. సైదిరెడ్డికి 113094 ఓట్లు రాగా కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన పద్మావతికి 69737 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో ఉత్తం కుమార్ రెడ్డికి 7466 ఓట్ల మెజార్గీ రాగా, ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఐ భారీతేడాతో ఓటమి చెందడం విశేషం. ఉప ఎన్నికలో బిజెపి, టిడిపిలు డిపాజిట్లు కోల్పోయాయి. 2014లో ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్లో గెలిస్తే, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి గెలుపొందడం విశేషం. 2009 శాసనసభలో మహబూబ్ నగర్ జిల్లాలో దంపతుల జంట దయాకరరెడ్డి, సీతలు మక్తల్,దేవరకద్ర ల నుంచి గెలుపొందగా, 2014లో ఆ అవకాశం ఉత్తంకుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతిలకు దక్కింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవీ దంపతులు కూడా 1953,1962లలో ఒకేసారి గెలుపొంది శాసనభకు వెళ్లారు. 2014లో ఆ గౌరవం ఉత్తం దంపతులకు లభించింది. ఉత్తం కుమార్ రెడ్డి 2014లో రాష్ట్రపతి పాలన వచ్చేవరకు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. రాజకీయాలలోకి రావడానికి ముందు ఈయన రాష్ట్రపతి భవన్లో బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పై 23924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1952 నుంచి 1972వరకు ఈ నియోజకవర్గం ఉండేది. మూడుసార్లు పిడిఎఫ్, ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ, ఒకసారి టిఆర్ఎస్, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. హుజూర్‌నగర్‌లో రెండుసార్లు గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు కోదాడ నుంచి ఒకసారి గెలుపొందారు. ఈయన గతంలో కాసు, పి.వి మంత్రివర్గాలలో పనిచేశారు. 1952లో జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, కవి ముక్దుం మొహియుద్దీన్ గెలుపొందారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. రెండు స్థానాలు పిడిఎఫ్ గెలుచుకుంది. అయితే జయసూర్య మెదక్ నుంచి లోక్‌సభకు కూడా ఎన్నికవడంతో ఏర్పడిన ఖాళీలో మొహియుద్దీన్ ఎన్నికయ్యారు. హుజూర్ నగర్ లో నాలుగుసార్లు రెడ్లు, మూడుసార్లు బ్రాహ్మణ,బిసి,ఎస్.సి, ముస్లిం వర్గాలు ఒక్కోసారి గెలుపొందాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మిర్యాలగూడ నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారిగెలిచారు. ఆయన 2014లో కాంగ్రెస్ ఐ టిక్కెట్‌పై విజయం సాదించి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్ లో చేరిపోయారు.2018లో టిఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీచేసి 30652 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భాస్కరరావు తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్యను ఓడిరచారు. 2014లో కృష్ణయ్య ఎల్బినగర్ నుంచి టిడిపి టిక్కెట్‌పై గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల ముందు ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ ఐలో చేరి మిర్యాలగూడ టిక్కెట్ పొంది పోటీచేసినా పలితం దక్కలేదు. భాస్కరరావుకు 83931 ఓట్లు రాగా, ఆర్.కృష్ణయ్యకు 53279 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్దిగా పోటీచేసిన స్కైలాబ్ నాయక్‌కు దాదాపు పద్నాలుగు వేల ఓట్లు వచ్చాయి. నల్లమోతు భాస్కరరావు కమ్మ సామాజికవర్గం నేత. సిపిఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడలో మూడుసార్లు గెలిచారు. మిర్యాలగూడలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, సిపిఎం ఐదుసార్లు గెలవగా, ఒకసారి పిడిఎఫ్, ఒకసారి టిఆర్ఎస్ గెలిచాయి. మరో నేత తిప్పన చినకృష్ణారెడ్డి ఇక్కడ నుండి మూడుసార్లు గెలిస్తే, ప్రముఖ కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు ఇక్కడ ఒకసారి, నల్గొండ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. చకిలం ఒకసారి లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. చినకృష్ణారెడ్డి, 1989లో గెలిచిన విజయసింహారెడ్డి తండ్రి, కుమారులు 2004లో ఇక్కడ టిడిపి పక్షాన పోటీచేసిన మాజీ పోలీసు అధికారి పి. చంద్రశేఖరరెడ్డి, ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరారు. 2009లో సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఒక్కసారి కూడా గెలుపొందలేదు. అయితే టిడిపి మిత్రపక్షంగా సిపిఎం గెలుపొందింది. మిర్యాలగూడలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం, నాలుగుసార్లు కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, ఒక్కొక్కసారి గెలిచారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నాగార్జునసాగర్ నియోజకవర్గం రాజకీయా..విజేతలు వీరే..
నాగార్జున సాగర్ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ది నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిపై విజయం సాదించినా, ఆయన అనతికాలంలో అనారోగ్యంతో కన్నుమూశారు.దాంతో ఉప ఎన్నికలో ఆయన కుమారుడు నోమలు భగత్ ను టిఆర్ఎస్ తన అబ్యర్దిగా రంగంలో దించింది. ఈ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస పక్షాన మాజీ మంత్రి అయిన జానారెడ్డి పోటీచేసినా ఫలితం దక్కలేదు. భగత్ 18872 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భగత్ కు 89804 ఓట్లు రాగా, జానారెడ్డికి 70932 ఓట్లు వచ్చాయి. బిజెపి తరపున పోటీచేసిన రవి నాయక్ 7676 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. అలాగే టిడిపి అబ్యర్ది మువ్వా అరుణ కుమారి కేవలం 1714 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. కాగా 2018 ఎన్నికలలో నోముల నరసింహయ్య 7171 ఓట్ల ఆదిక్యత వచ్చింది. నరసింహయ్యకు 83655 ఓట్లు రాగా, జానారెడ్డికి 76884 ఓట్లు వచ్చాయి.యాదవ వర్గానికి చెందిన నరసింహయ్య 1999, 2004 ఎన్నికలలో సిపిఎం పక్షాన నకిరేకల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడ్‌గా మారింది. అదే సమయంలో నోముల పార్టీ వైఖరులతో విబేదించి టిఆర్ఎస్లో చేరి సాగర్ నుంచి పోటీచేసి 2014లో ఓటమి చెంది,2018లో గెలుపొందారు. దీనితో ఆయన మూడో సారి గెలిచినట్లయింది. కాని దురదృష్టవశాత్తు మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో ఆయన కుమారుడు భగత్ గెలిచారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2014లో జానారెడ్డి ఏడో సారి విజయం సాధించారు. ఈయన తన సమీప ప్రత్యర్ధి, టిఆర్ఎస్లో చేరిన మాజీ సిపిఎం నేత నోముల నరసింహయ్యను 16476 ఓట్ల తేడాతో ఓడిరచారు. తెలంగాణలో అత్యధికసార్లు గెలిచిన ప్రముఖులలో జానారెడ్డి ఒకరు. 1983 నుంచి ఒక్క టరమ్‌లో తప్ప 2018 వరకు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డికి ఉంది. అలాగే తెలంగాణలో మంత్రిగా కూడా ఈయనదే రికార్డు. సమైక్య రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలకు పైగా మంత్రి పదవి చేసిన రికార్డు జానారెడ్డి సొంతం. 2004 నుంచి ఐదేళ్ళపాటు హోం మంత్రిగా పనిచేసిన ఈయనకు రాజశేఖరరెడ్డి రెండో టరమ్‌లో మంత్రి పదవి లభించక పోవడం విశేషం. ఆ తరువాత రోశయ్య క్యాబినెట్లో కూడా ఛాన్స్ రాలేదు. తదుపరి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జానారెడ్డి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఈయన కీలక భూమిక పోషించడం విశేషం. నోముల నరసింహయ్య నకిరేకల్ నియోజకవర్గం రిజర్వు కాకముందు రెండుసార్లు అక్కడ నుంచి శాసన సభకు ఎన్నికై సిపిఎం పక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీతో విబేధించి టిఆర్ఎస్లో చేరారు. గతంలో చలకుర్తి పేరుతో ఉన్న నియోజకవర్గం 2009లో నాగార్జున సాగర్‌గా మారింది. చలకుర్తి 1967లో ఏర్పడగా అప్పటి నుంచి తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు గెలవగా, టిడిపి మూడుసార్లు గెలుపొందితే, ఇండిపెండెంటు ఒకరు విజయం సాధించారు. జానారెడ్డి 1978లో జనతాపార్టీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1983, 85లలో టిడిపి తరుపున, 1989, 99, 2004, 2009, 2014లలో కాంగ్రెస్ఐ తరుపున గెలిచారు. 1994లో నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించకుండా గెలవాలన్న లక్ష్యంతో ఎక్కడ తిరగలేదు. ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. జానారెడ్డి 1983-89 మధ్య ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో ఉండగా, 1992లో కోట్ల క్యాబినెట్‌లోను, 2004లో వైఎస్ క్యాబినెట్‌లోను, తదుపరి కిరణ్ క్యాబినెట్‌లోను పనిచేశారు. చలకుర్తిలో నిమ్మల రాములు మూడుసార్లు గెలిచారు. సాగర్, చలకుర్తిలలో కలిపి ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం గెలిస్తే, ఐదు సార్లు బిసిలు (యాదవ) వర్గం గెలిచారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం విజేత ఎవరు..!
దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గం దేవరకొండ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆర్.రవీంద్ర కుమార్ మూడోసారి విజయం సాదించారు.2004,2014లలో సిపిఐ పక్షాన గెలిచిన రవీంద్ర కుమార్ 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. 2014లో విజయం సాదించిన కొంతకాలానికి ఆయన అదికార టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఎన్నికలో ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌పై 38848 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రవీంద్రకుమార్‌కు 96454 ఓట్లు రాగా, బాలూనాయక్‌కు 57606 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి పక్షాన పోటీచేసిన బిల్యా నాయక్‌కు 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో కాంగ్రెస్ ఐ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ తెలంగాణ లో దేవరకొండ ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. 2014లో రమావత్ రవీంద్ర కుమార్ తన సమీప టిడిపి-బిజెపి కూటమి ప్రత్యర్ధి బిల్యానాయక్ పై 4216 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు . దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఏడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి. సిపిఐ నాయకుడు బద్దు చౌహాన్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. గిరిజన నేత రవీంద్రనాయక్ ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2004లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. దేవరకొండలో ఒక్కసారి కూడా టిడిపి గెలవలేదు. రవీంద్రనాయక్ గతంలో భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 1999లో ఇక్కడ గెలిచిన రాగ్యానాయక్ 2001 డిసెంబర్లో నక్సల్స్ కాల్పులలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో రాగ్యానాయక్ భార్య భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం భారతి ఎమ్మెల్సిగా కూడా ఎన్నికయ్యారు. దేవరకొండ ఎస్.టి.లకు రిజర్వు కాక ముందు రెడ్లు రెండుసార్లు బ్రాహ్మణ ఒకసారి గెలిచారు. దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..