పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిగా విడగొట్టబడ్డాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాగా ఉన్న సమయంలో జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండేవి. ఇందులో రెండు ఎస్సీలకు ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి.
మిగతా 9 నియోజకవర్గాలు జనరల్కు కేటాయించబడ్డాయి. ఎస్సీలకు కేటాయించబడిన నియోజకవర్గాలు: నకిరేకల్( నల్లగొండ జిల్లా), తుంగతుర్తి( సూర్యాపేట జిల్లా) ఎస్టీలకు కేటాయించబడిన నియోజకవర్గం: దేవరకొండ( నల్లగొండ జిల్లా) ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా సూర్యాపేటలో నాలుగు నియోజకవర్గాలు, యాదాద్రిలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి.
నల్లగొండ జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల వివరాలు
- నల్లగొండ
- మిర్యాలగూడ
- నాగార్జునా సాగర్
- నకిరేకల్(ఎస్సీ)
- మునుగోడు
- దేవరకొండ(ఎస్టీ)
సూర్యాపేట జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వివరాలు
- సూర్యాపేట
- కోదాడ
- తుంగతుర్తి(ఎస్సీ)
- హుజూర్ నగర్
యాదాద్రి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు
- భువనగిరి
- ఆలేరు
► మొత్తం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. మరో 6 నియోజకవర్గాల్లో మాత్రం పురుష ఓటర్లు మహిళల కంటే ఎక్కువగా ఉన్నారు.
► నల్లగొండ, సూర్యాపేట, హూజూర్ నగర్, కోదాడ, నాగార్జునా సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారు.
► దేవరకొండ, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య
- 26,87,818 మంది. ఈ సంఖ్య గతేడాది కంటే 11,399 మంది ఓటర్లు తక్కువగా ఉన్నారు.
వయస్సుల వారిగా ఓటర్ల సంఖ్య:
18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్లు
- నల్లగొండ: 17562
- సూర్యాపేట: 9734
- యాదాద్రి: 23750
20 నుంచి 29 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న ఓటర్ల సంఖ్య
- నల్లగొండ: 254468
- సూర్యాపేట: 157652
- యాదాద్రి: 116685
Comments
Please login to add a commentAdd a comment