నాగార్జున సాగర్ నియోజకవర్గం
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికలలో టిఆర్‌ఎస్ అభ్యర్ది నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిపై విజయం సాదించినా, ఆయన అనతికాలంలో అనారోగ్యంతో కన్నుమూశారు.దాంతో ఉప ఎన్నికలో ఆయన కుమారుడు నోమలు భగత్ ను టిఆర్‌ఎస్ తన అబ్యర్దిగా రంగంలో దించింది. ఈ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస పక్షాన మాజీ మంత్రి అయిన జానారెడ్డి పోటీచేసినా ఫలితం దక్కలేదు. భగత్ 18872 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భగత్ కు 89804 ఓట్లు రాగా, జానారెడ్డికి 70932 ఓట్లు వచ్చాయి.
బిజెపి తరపున పోటీచేసిన రవి నాయక్ 7676 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. అలాగే టిడిపి అబ్యర్ది మువ్వా అరుణ కుమారి కేవలం 1714 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. కాగా 2018 ఎన్నికలలో నోముల నరసింహయ్య 7171 ఓట్ల ఆదిక్యత వచ్చింది. నరసింహయ్యకు 83655 ఓట్లు రాగా, జానారెడ్డికి 76884 ఓట్లు వచ్చాయి.యాదవ వర్గానికి చెందిన నరసింహయ్య 1999, 2004 ఎన్నికలలో సిపిఎం పక్షాన నకిరేకల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడ్‌గా మారింది. అదే సమయంలో నోముల పార్టీ వైఖరులతో విబేదించి టిఆర్‌ఎస్‌లో చేరి సాగర్ నుంచి పోటీచేసి 2014లో ఓటమి చెంది,2018లో గెలుపొందారు.
దీనితో ఆయన మూడో సారి గెలిచినట్లయింది. కాని దురదృష్టవశాత్తు మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో ఆయన కుమారుడు భగత్ గెలిచారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2014లో జానారెడ్డి ఏడో సారి విజయం సాధించారు. ఈయన తన సమీప ప్రత్యర్ధి, టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సిపిఎం నేత నోముల నరసింహయ్యను 16476 ఓట్ల తేడాతో ఓడిరచారు. తెలంగాణలో అత్యధికసార్లు గెలిచిన ప్రముఖులలో జానారెడ్డి ఒకరు. 1983 నుంచి ఒక్క టరమ్‌లో తప్ప 2018 వరకు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డికి ఉంది.
అలాగే తెలంగాణలో మంత్రిగా కూడా ఈయనదే రికార్డు. సమైక్య రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలకు పైగా మంత్రి పదవి చేసిన రికార్డు జానారెడ్డి సొంతం. 2004 నుంచి ఐదేళ్ళపాటు హోం మంత్రిగా పనిచేసిన ఈయనకు రాజశేఖరరెడ్డి రెండో టరమ్‌లో మంత్రి పదవి లభించక పోవడం విశేషం. ఆ తరువాత రోశయ్య క్యాబినెట్‌లో కూడా ఛాన్స్ రాలేదు. తదుపరి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జానారెడ్డి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఈయన కీలక భూమిక పోషించడం విశేషం.
నోముల నరసింహయ్య నకిరేకల్ నియోజకవర్గం రిజర్వు కాకముందు రెండుసార్లు అక్కడ నుంచి శాసన సభకు ఎన్నికై సిపిఎం పక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీతో విబేధించి టిఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో చలకుర్తి పేరుతో ఉన్న నియోజకవర్గం 2009లో నాగార్జున సాగర్‌గా మారింది. చలకుర్తి 1967లో ఏర్పడగా అప్పటి నుంచి తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఐదుసార్లు గెలవగా, టిడిపి మూడుసార్లు గెలుపొందితే, ఇండిపెండెంటు ఒకరు విజయం సాధించారు. జానారెడ్డి 1978లో జనతాపార్టీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు.
1983, 85లలో టిడిపి తరుపున, 1989, 99, 2004, 2009, 2014లలో కాంగ్రెస్‌ఐ తరుపున గెలిచారు. 1994లో నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించకుండా గెలవాలన్న లక్ష్యంతో ఎక్కడ తిరగలేదు. ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. జానారెడ్డి 1983-89 మధ్య ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లో ఉండగా, 1992లో కోట్ల క్యాబినెట్‌లోను, 2004లో వైఎస్ క్యాబినెట్‌లోను, తదుపరి కిరణ్ క్యాబినెట్‌లోను పనిచేశారు. చలకుర్తిలో నిమ్మల రాములు మూడుసార్లు గెలిచారు. సాగర్, చలకుర్తిలలో కలిపి ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం గెలిస్తే, ఐదు సార్లు బిసిలు (యాదవ) వర్గం గెలిచారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment