Nomula Bhagat
-
పార్వతీపురంలో పంచాయతీ శిలాఫలకం ధ్వంసం
నిడమనూరు: నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని బుధవారం దుండగులు ధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022సంవత్సరంలో విడుదల చేసిన రూ.20లక్షల నిధులతో గ్రామంలో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సర్పంచ్ల పదవీకాలం బుధవారంతో ముగియనుండడంతో శిలాఫలకంపై తన పేరు ఉండాలని సర్పంచ్ వంకా బ్రహ్మన్న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశాడు. ఇంకా పూర్తి కాని పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం భవనం ప్రారంభోత్సవం చేసేందుకు సర్పంచ్ వచ్చే సరికి శిలాఫలకం ధ్వంసమై ఉంది. దీంతో సర్పంచ్ వంకా బ్రహ్మన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు నిధులు విడుదల చేశామని, కాంగ్రెస్ వారు ఓర్చుకోలేకనే ఇలా శిలాఫలకాన్ని ధ్వంసం చేసారని ఆరోపించారు. శిలాఫలకాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు వేములపల్లి వెంకట్రావు, మద్దిపూడి రాంబాబు, కుంబం విజయ్, కంచి శ్రీను ధ్వంసం చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ సర్పంచ్ బ్రహ్మన్న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నారని డిగితే దూషించారని స్థానిక కాంగ్రెస్ నాయకుడు వేములపల్లి వెంకట్రావు సర్పంచ్‌తో పాటు వంకా బ్రహ్మన్న, సత్యనారాయణ, నక్క సైదులు, కృష్ణమూర్తిపై మరో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ గోపాల్‌రావు తెలిపారు. ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. – వంకా బ్రహ్మన్న, సర్పంచ్, పార్వతీపురం సమాచారం లేదు పార్వతీపురం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం గురించి అధికారికంగా సమాచారం లేదు. భవనం పూర్తి అయిన తర్వాత ప్రాంరంభిస్తాం. భవనం పూర్తయినట్లు కూడా సమాచారం అందలేదు. – ప్రమోద్‌కుమార్, ఎంపీడీఓ, నిడమనూరు -
నా బలం, బలగం ‘సాగర్’ ప్రజలే.. అవే నన్ను గెలిపిస్తాయి: ఎమ్మెల్యే భగత్
‘సాగర్ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం. నేను ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గతంతో పోల్చితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ పథకాలు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సాక్షితో మాట్లాడారు. నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటున్నా. ఇక్కడే స్థిరనివాసం ఏర్పచుకుని నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా. సాగర్‌లో ఏడు సార్లు పాలించినవారు చేయని అభివృద్ధిని కేవలం రెండున్నరేళ్లల్లోనే నేను చేసి చూపెట్టా. బలహీనవర్గాల బిడ్డగా ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. రూ.200 కోట్లతో అభివృద్ధి చేశా.. 2018లో తొలిసారిగా మా నాన్న నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలిచాక హాలియా, నందికొండను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలో 40 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. నేను గెలిచాక రూ.60 కోట్లతో హాలియా, నందికొండ పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. వరద కాల్వ పనులను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. నియోజకవర్గంలో 10 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాం. నందికొండలో క్వాటర్స్‌లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చాం. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాం. సాగర్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలోని మూడు పీహెచ్‌సీలకు రూ.25 లక్షల చొప్పున కేటాయించి అభివృద్ధి చేశాం. కంపాసాగర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలగా ఏర్పాటు చేయడమే నాముందు ఉన్న ఏకైక లక్ష్యం. నెల్లికల్లు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. రూ.664 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దవూర మండలంలో సుమారు రూ.2.5 కోట్లతో డీ8, డీ9 లిఫ్ట్ పనులు పూర్తి చేశాం. దీని ద్వారా 7300 ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.33.81 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాం. ఇంకా త్రిపురారం, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో లిఫ్ట్‌లు, చెక్‌డ్యాంల ఏర్పాటు చేయాల్సి ఉంది. -
వీడియో క్లిప్పింగ్ చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా
నల్గొండ: తన తండ్రి కుందూరు జానారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా అన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు సవాల్ విసిరారు. బుధవారం నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి హాలియా సభలో చెప్పింది నిజమైతే వీడియో క్లిప్పింగ్ చూపించాలన్నారు. ఉచిత విద్యుత్ నాలుగేళ్లు ఇస్తే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని నాడు ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి అన్నారని సీఎం కేసీఆర్ మంగళవారం హాలియా ప్రజా ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించడంపై జైవీర్‌రెడ్డి స్పందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయిరెడ్డి, అంకతి సత్యం, కొండా శ్రీనివాసరెడ్డి, శివమారయ్య, నూకల వెంకట్‌రెడ్డి, అంకతి వెంకటరమణ, బొల్లం శ్రీనివాస్ యాదవ్, ప్రభాకరరెడ్డి, వల్లబరెడ్డి, వివేక్ కృష్ణ, మేరెడ్డి వెంకటరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా నాగార్జున సాగర్ రాజకీయం
నల్గొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడీ నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో నాగార్జునసాగర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ముగ్గురు యువ నాయకుల మద్య పోటి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు పార్టీ అధిష్టానం అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించినా.. ఇటీవల భగత్‌కే భీఫాం ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు చెక్‌పడింది. ఎప్పటి నుంచి పార్టీలో ఉంటూ, నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అతన్ని కాదని భగత్‌ను టికెట్ ఇవ్వడంతో మన్నెం రంజిత్ యాదవ్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో చేరి భగత్‌కు ప్రత్యర్థిగా మారారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీలో నిలిచారు. అయితే నియోజకవర్గంలో యాదవ వర్గం వారు ఎక్కువగా ఉండటం మన్నెం రంజిత్ యాదవ్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో నాగార్జున సాగర్‌లో కమల జెండా ఎగరేసి తీరాతామని రంజిత్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నాగార్జున సాగర్ ఎవరి వశం కానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
నాగార్జున సాగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ!
నాగార్జున సాగర్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో కీలక నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న ఆయన.. కారు దిగేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 500 మందితో కలిసి కాషాయ కండువా కప్పుకొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తయినట్లు సమాచారం. నియోజకవర్గ, నాయకులతో కలిసి రెండు రోజులు క్రితం బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బీజేపీలోకి రావాలని పార్టీ నాయకులు ఆ యంగ్ లీడర్‌ను ఆహ్వానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలక నేతల హామీ మేరకు బీజేపీలో చేరాలని యువ నాయకుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా బీఆర్ఎస్లో తనకు లభించే ప్రాధాన్యత మూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జనాల్లో ఆదరణ ఉన్న బీసీ నాయకుడు విదేశాల నుంచి స్వదేశానికి సేవ చేయాలనే ఆలోచనలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ్ సామాజికవర్గం నుంచి గట్టి పట్టు ఉన్న నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ బీజేపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అయింది. ఈ యువ నాయకుడితో పాటు పలువురు నాయకులు కూడా తనతో పాటు కమలం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నారనే చెప్పవచ్చు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మనవడు గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్ఎస్ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి నాగార్జునసాగర్ నియోజకవర్గం టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న మన్నెం రంజిత్ యాదవ్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని పలువరు స్థానికులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ.. నాగార్జునసాగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
ఆగని అసంతృప్తులు.. సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఆగడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు, అసంతృప్తుల మధ్య ఫైట్ కొనసాగుతూనే ఉంది. కనీసం వారిని బుజ్జగించే చర్యలు కూడా కనిపించకపోవడంతో ఎవరి ప్రచారంలో వారు మునిగారు. అధికార పార్టీలోనే ఉంటూ తిరుగుబాటు జెండా ఎగురవేసిన అసంతృప్తులు బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తుండగా, మరికొన్ని చోట్ల తమకు టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. నల్లగొండ వంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటామంటూ ఆశావహులు తిరుగుబాటు చేస్తుండగా, ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ రాజకీయం గందరగోళంగా మారింది. వేచి చూసే ధోరణిలో అధిష్టానం.. నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నా బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్‌లు పోటీలో ఉంటారంటూ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాటి నుంచి ఆశావహులు ఎవరికి వారే కార్యక్రమాలను చేసుకుంటున్నా నిలువరించిన సందర్భాలు లేవు. ఇదీ అభ్యర్థులుగా పోటీలో ఉండబోయే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఇటు సిట్టింగ్ అభ్యర్థులు, అటు ఆశావహులు ఎవరికి వారు ప్రచారం కొనసాగిస్తుండడంతో అసలు అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు ప్రకటించిన వారికే వస్తుందా? ఏమైనా మార్పులు ఉంటాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పైకి టికెట్ తమకేనని గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల వారికి ఆందోళన తప్పడం లేదని ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి’తో పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతోంది. పలు నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి.. ► నాగార్జునసాగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు అధిష్టానం టిికెట్ కేటాయించింది. అయితే ఆశావహలు మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారి అనుచరులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక నేత మన్నెం రంజిత్ యాదవ్‌కు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని ప్రజలు కోరుతున్నారు. రంజిత్ యాదవ్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ, ఆయనకే టికెట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ► నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికే అధిష్టానం టికెట్ ఇస్తామని ప్రకటించింది. అయితే పట్టణానికి చెందిన కౌన్సిలర్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్ తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. తాజాగా తన ఫ్లెక్సీలు భూపాల్‌రెడ్డి వర్గం నేతలు చింపారంటూ మంగళవారం నల్లగొండలో నిరసన ర్యాలీ చేపట్టారు. ► నకిరేకల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే టికెట్ అని అధిష్టానం ప్రకటించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడినా ప్రయోజనం లేకుండాపోయింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీకి వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కూడా కలిశారు. ► దేవరకొండలోనూ అసంతృప్తి చల్లారడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు టికెట్ ప్రకటించక ముందు నుంచే ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి స్థానిక నేతలు విన్నవించారు. మంత్రి హరీశ్‌రావును కలిసి తమ వ్యతిరేకతను తెలియజేశారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్ వర్గం రవీంద్రకుమార్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేసింది. దేవేందర్‌నాయక్ ఇటీవల తన అనుచరులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ► కోదాడలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ను మార్చాలని ఆయన వ్యతిరేకవర్గం పట్టుపడుతోంది. అక్కడి పార్టీ నేతలు శశిధర్‌రెడ్డి, చందర్రావు ఎమ్మెల్యేతో విభేదిస్తూ తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ► ఆలేరులో నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆలేరు అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పేరు ఖరారైన తరువాత మోత్కుపల్లికి ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు సమావేశం పెట్టి డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోవడం లేదెందుకో? వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోతున్నా, పార్టీలో ఉండి అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా, ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నా.. అధిష్టానం ఎందుకు ఈ విషయంలో మిన్నకుండిపోతుందన్న దానిపైనే చర్చ సాగుతోంది. అసంతృప్తులను దారికి తెచ్చుకోవడం, లేదా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండని వారిపై చర్యలు తీసుకోవడం వంటి కార్యాచరణను ఎందుకు అమలు చేయడం లేదన్న దానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సిట్టింగుల్లోనూ ఆందోళన నెలకొంది. అభ్యర్థులుగా పేర్లు ప్రకటించినా, చివరికి టికెట్ ఇస్తారా? లేదా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు అధిష్టానం సర్వే చేయిస్తోందని, దాని ఫలితాలు వచ్చాకే అసంతృప్తుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుందన్న వాదనను పార్టీ వర్గాల నుంచి వస్తున్నా.. సిట్టింగ్‌లకు మాత్రం చికాకు తప్పడం లేదు. -
సాగర్ అభ్యర్థిని మార్చాలి.. లేదంటే!.. బీఆర్ఎస్ నేతల డిమాండ్
సాక్షి, నల్గొండ: ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనతో అధికార బీఆర్ఎస్ అమ్మతి జ్వాలలు తీవ్ర స్థాయికి చేరాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సిట్టింగ్‌లకు టికెట్టు ఇవ్వడంతో స్థానిక నేతలు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నియమాకాన్ని వెనక్కి తీసుకోవాలిని వాదిస్తున్నారు. ఎమ్మెల్యే నోముల భగత్‌పై అసంతృప్తి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో, నాయకుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. ఈ మేరకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశావాహి మన్నెం రంజిత్ యాదవ్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా పనిచేసి నోముల భగత్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు పార్టీ సమావేశానికి స్థానిక నేతలను ఆహ్వానించడం లేదని మండిపడ్డారు. తండ్రి పేరుతో ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనకు కార్యకర్తలతో ఎలా మాట్లాడాలనేది కూడా తెలియదని విమర్శించారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామల్లో కొట్లాటలు జరుగుతున్నాయని, సమస్యలను పరిష్కరించడంలో నోముల భగత్ విఫలమయ్యారని అన్నారు. ఆయన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. భగత్‌ను కాకుండా స్థానిక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. భగత్‌ను మార్చకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెడతామని ముక్తకంఠంతో తెలిపారు. -
నాగార్జునసాగర్ నియోజకవర్గం రాజకీయా..విజేతలు వీరే..
నాగార్జున సాగర్ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ది నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిపై విజయం సాదించినా, ఆయన అనతికాలంలో అనారోగ్యంతో కన్నుమూశారు.దాంతో ఉప ఎన్నికలో ఆయన కుమారుడు నోమలు భగత్ ను టిఆర్ఎస్ తన అబ్యర్దిగా రంగంలో దించింది. ఈ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస పక్షాన మాజీ మంత్రి అయిన జానారెడ్డి పోటీచేసినా ఫలితం దక్కలేదు. భగత్ 18872 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భగత్ కు 89804 ఓట్లు రాగా, జానారెడ్డికి 70932 ఓట్లు వచ్చాయి. బిజెపి తరపున పోటీచేసిన రవి నాయక్ 7676 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. అలాగే టిడిపి అబ్యర్ది మువ్వా అరుణ కుమారి కేవలం 1714 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. కాగా 2018 ఎన్నికలలో నోముల నరసింహయ్య 7171 ఓట్ల ఆదిక్యత వచ్చింది. నరసింహయ్యకు 83655 ఓట్లు రాగా, జానారెడ్డికి 76884 ఓట్లు వచ్చాయి.యాదవ వర్గానికి చెందిన నరసింహయ్య 1999, 2004 ఎన్నికలలో సిపిఎం పక్షాన నకిరేకల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడ్‌గా మారింది. అదే సమయంలో నోముల పార్టీ వైఖరులతో విబేదించి టిఆర్ఎస్లో చేరి సాగర్ నుంచి పోటీచేసి 2014లో ఓటమి చెంది,2018లో గెలుపొందారు. దీనితో ఆయన మూడో సారి గెలిచినట్లయింది. కాని దురదృష్టవశాత్తు మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో ఆయన కుమారుడు భగత్ గెలిచారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2014లో జానారెడ్డి ఏడో సారి విజయం సాధించారు. ఈయన తన సమీప ప్రత్యర్ధి, టిఆర్ఎస్లో చేరిన మాజీ సిపిఎం నేత నోముల నరసింహయ్యను 16476 ఓట్ల తేడాతో ఓడిరచారు. తెలంగాణలో అత్యధికసార్లు గెలిచిన ప్రముఖులలో జానారెడ్డి ఒకరు. 1983 నుంచి ఒక్క టరమ్‌లో తప్ప 2018 వరకు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డికి ఉంది. అలాగే తెలంగాణలో మంత్రిగా కూడా ఈయనదే రికార్డు. సమైక్య రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలకు పైగా మంత్రి పదవి చేసిన రికార్డు జానారెడ్డి సొంతం. 2004 నుంచి ఐదేళ్ళపాటు హోం మంత్రిగా పనిచేసిన ఈయనకు రాజశేఖరరెడ్డి రెండో టరమ్‌లో మంత్రి పదవి లభించక పోవడం విశేషం. ఆ తరువాత రోశయ్య క్యాబినెట్లో కూడా ఛాన్స్ రాలేదు. తదుపరి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జానారెడ్డి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఈయన కీలక భూమిక పోషించడం విశేషం. నోముల నరసింహయ్య నకిరేకల్ నియోజకవర్గం రిజర్వు కాకముందు రెండుసార్లు అక్కడ నుంచి శాసన సభకు ఎన్నికై సిపిఎం పక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీతో విబేధించి టిఆర్ఎస్లో చేరారు. గతంలో చలకుర్తి పేరుతో ఉన్న నియోజకవర్గం 2009లో నాగార్జున సాగర్‌గా మారింది. చలకుర్తి 1967లో ఏర్పడగా అప్పటి నుంచి తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు గెలవగా, టిడిపి మూడుసార్లు గెలుపొందితే, ఇండిపెండెంటు ఒకరు విజయం సాధించారు. జానారెడ్డి 1978లో జనతాపార్టీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1983, 85లలో టిడిపి తరుపున, 1989, 99, 2004, 2009, 2014లలో కాంగ్రెస్ఐ తరుపున గెలిచారు. 1994లో నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించకుండా గెలవాలన్న లక్ష్యంతో ఎక్కడ తిరగలేదు. ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. జానారెడ్డి 1983-89 మధ్య ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో ఉండగా, 1992లో కోట్ల క్యాబినెట్‌లోను, 2004లో వైఎస్ క్యాబినెట్‌లోను, తదుపరి కిరణ్ క్యాబినెట్‌లోను పనిచేశారు. చలకుర్తిలో నిమ్మల రాములు మూడుసార్లు గెలిచారు. సాగర్, చలకుర్తిలలో కలిపి ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం గెలిస్తే, ఐదు సార్లు బిసిలు (యాదవ) వర్గం గెలిచారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అక్కడి బీఆర్ఎస్లో వర్గపోరు.. మన్నెంకు టికెట్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్ఎస్ పార్టీలో అంసతృప్తి నాయకులు పెరుగుతున్నారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవల చకిలం అనిల్‌కుమార్ పార్టీని వీడగా.. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మందుల సామేలు రాజీనామా చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ జెడ్పీటీసీ, మరికొంత మంది నాయకులు కూడా పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. మరికొందరు అంతర్గతంగా తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది. ఇటు అంసతృప్తులు అటు ఆశావహులతో బీఆర్ఎస్ అధిష్టానం ఉక్కిరిబిక్కరి అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో కీలకగా పనిచేసిన నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వారిలో కొందరికి కార్పొరేషన్ తదితర పదవులను ఇచ్చి సంతృప్తి పరిచినా మరికొందరు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతోనే ఉన్నారు. అలా మందుల సామేలు లాంటి కొందరు పార్టీని వీడుతున్నారు. కొందరు సీఎం కేసీఆర్‌పై భారం వేసి, ఎదురుచూస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా.. నల్లగొండ నియోజకవర్గానికి చెందిన చకిలం అనిల్‌కుమార్ తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాకముందు ఆయ న నల్లగొండ నుంచి పోటీ చేయాలనుకున్నారు. 2009లో పొత్తుల్లో భాగంగా టికెట్ కాంగ్రెస్‌కు పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన దుబ్బాక నర్సింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో చకిలంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన ఇటీవల తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు నియోజక వర్గంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్న చాడ కిషన్‌రెడ్డి ప్రతిసారి అడుగుతున్నా ఇవ్వడం లేదు. మరోవైపు పిల్లి రామరాజు సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ► కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కన్నంతరెడ్డి శశిధర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ వస్తుందనుకున్నా చివరి నిమిషంలో తెలుగుదేశం నుంచి వచ్చిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు టికెట్ దక్కింది. ఆతర్వాత శశిధర్‌రెడ్డికి ఎలాంటి పదవులూ దక్కలేదు. ఈసారి ఆయన టికె ట్ కచ్చితంగా వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో ఎన్ఆర్ఐ జలగం సుధీర్ కూడా ఉన్నారు. ► నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మె ల్యే నోముల భగత్‌కు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. మరోవైపు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్, కట్టెబోయిన గురువయ్య యాదవ్ ఉన్నారు. ► దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గీయుల మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతున్నాయి. బయటి విమర్శలు చేసుకోకపోయినా అవి అంతర్గంగా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ► నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఎమ్మెల్యే లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగులకే ఈసారి టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో.. టికెట్ రాకపోతే వీరేశం పార్టీ నుంచి వెళ్లిపోతాడన్న చర్చ సాగుతోంది. ► మునుగోడు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. చాలా సందర్భాల్లో అవి బయటపడ్డాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికితోపాటు మాజీ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, గుత్తా అమిత్‌రెడ్డి, నారబోయిన రవి, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ► తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మందుల సామేలు కూడా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో గాదరి కిషోర్‌కుమార్‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. సామేలుకు కార్పొరేషన్ పదవి ఇచ్చినా, ఎమ్మెల్యే కావాలన్న కోరికతో టికెట్ అడుతున్నారు. తిరుమలగిరిలో గురువారం జరిగిన ప్రగతి నివేదన సభలో కిషోర్‌ను మూడోసారి గెలిపించాలని కేటీఆర్ ప్రకటించడతో తనకు ఇక టికెట్ రాదని భావించి సామేలు బీఆర్ఎస్కు రాజీనామ చేశారు. ► సూర్యాపేటలో పార్టీ శ్రేణులంతా మంత్రి జగదీ‹శ్రెడ్డికే మద్దతు పలుకుతున్నారు. టికెట్ ఆశించేవారు ఎవరూ లేరు. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై అసంతృప్తి ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించేవారు పెద్దగాలేరు. ఆలేరు నియోజకవర్గంలోని అదే పరిస్థితి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్లో చేరారు. అధిష్టానం ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది తేలాల్సి ఉంది. భువనగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కాదని, టికెట్ ఆశించేవారు ఇప్పటివరకు బయటకు రాలేదు. -
కేసీఆర్ చెప్పినా కూడా ఎమ్మెల్యేల కాళ్లులాగే ప్రయత్నాలు.. ఇలాగైతే కష్టమే!
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ బీఆర్ఎస్ పార్టీలో లొల్లి ఎక్కువవుతోంది. టిక్కెట్ల పోరు తీవ్రమవుతోంది. సిటింగ్‌లకే సీట్లని కేసీఆర్ ప్రకటించాక కూడా ఎమ్మెల్యేల కాళ్ళులాగే ప్రయత్నాలు ఆగడంలేదు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తలనొప్పులు పెరిగాయట. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు వర్గపోరుతో పాటు.. కొత్త తలనొప్పులు మొదలయ్యాయని టాక్. సొంత వర్గం నేతలు కూడా ఎమ్మెల్యే మాటల్ని పెడచెవిన పెడుతూ బహిరంగంగా కయ్యానికి కాలు దువ్వుతున్నారట. ఇప్పటికే సాగర్ బీఆర్ఎస్ పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో అక్కడ పార్టీ శ్రేణులు కూడా రెండు వర్గాలుగా విడిపోయాయి. రెండు గ్రూపులకు తోడు మధ్యలో మరో నేత రావడంతో ఇప్పుడు మూడు ముక్కలాట సాగుతోంది. ఈ పరిస్థితుల్లో సొంత వర్గాన్ని కాపాడుకుంటూ.. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎమ్మెల్యేలకు సమయం సరిపోవడంలేదట. అంతా గందరగోళంగా మారడంతో సొంత వర్గం నుంచి కూడా ఎమ్మెల్యే భగత్‌కు సమస్యలు ఎదురవుతున్నాయట. ఇవన్నీ చూసి ఎమ్మెల్యేకు తలబొప్పి కడుతోందని టాక్. చదవండి: తేరా చిన్నపరెడ్డి రాజకీయ అదృష్టమెంత? కారులో సీటుందా? ప్రచారంతో వివాదం ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పంచాయితీ కొనసాగుతున్న తరుణంలోనే.. సొంత వర్గానికి చెందిన చోటా నేతలు చేస్తున్న హంగామా ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే బజారుకెక్కి బట్టలు చింపుకుంటుండటంతో ఏం చేయాలో అర్థం కావడంలేదట. సొంతవర్గంలోని గొడవలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఎమ్మెల్యే ఆందోళన పడుతున్నారని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారు. తాజాగా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పెద్ద హీరో సినిమా విడుదల సమయంలో అభిమానులు పెట్టినట్లుగా ఫ్లెక్సీలను ఊరంతా నింపేశారట. వాటిలో ఒకచోట నిడుమనూరు ఎంపీపీ జయమ్మ ఫోటో పెట్టలేదట. దీంతో ఆమె అనుచరులు కొందరు అక్కడకు చేరుకుని నానా హంగామా చేశారు. తమ నేత ఫోటో లేకుండా ఫెక్సీలు పెడతారా? మీకెంత ధైర్యం అంటూ అందులో తమ నాయకుడు భగత్ ఫోటో ఉందన్న విషయం కూడా మర్చిపోయి వాటిని చించేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయట. సోషల్ మీడియాలో వైరల్ అసలు ఏం జరుగుతుందో అర్థంకాక కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి సర్ధిచెప్తున్నా ఎంపీపీ అనుచరుడు వినిపించుకోకుండా రోడ్డుపైనే గొడవకు దిగారట. దాదాపు గంట పాటు ఈ గొడవ జరగడంతో పార్టీ పరువు పోతుందని అక్కడే ఉన్న ఓ నాయకుడు ఎమ్మెల్యేకు విషయం చేరవేశాడట. దీంతో ఎమ్మెల్యే సీరియస్ అయి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా సదరు నేత వెనక్కి తగ్గలేదట. మరోవైపు ఇదే అవకాశమని వైరి వర్గం ఆ వీడియోను విస్తృతంగా వైరల్ చేసేసిందట. దీంతో ఒక్కసారిగా నాగార్జున సాగర్ లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఇది మీడియాలో కూడా రావడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎమ్మెల్యే ఎంపీపీతో వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్నాళ్లు అక్కడ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నువ్వా నేనా అన్నట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రాజకీయాలు సాగుతున్నాయి. వీరి పోరుతోనే పార్టీ పరువు సాగర్‌లో కలుస్తోందని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ తాజాగా ఎమ్మెల్యే వర్గానికి చెందినవారే రొడ్కెక్కడంతో ఏంటీ కొత్త గోల అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. అసలే భగత్ ఎక్కడ దొరుకుతాడా కసి తీర్చుకుందాం అని ఎదురుచూస్తోన్న ఎమ్మెల్సీ వర్గానికి ఎమ్మెల్యే సొంత వర్గమే వారికి ఇప్పుడో ఆయధం ఇచ్చినట్లు అయిందట. మొత్తానికి అందరూ కలిసి పార్టీ పరువును సాగర్‌లో కలిపేస్తున్నారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Father's Day: తండ్రిని తలుచుకొని పాట పాడిన ఎమ్మెల్యే నోముల భగత్
సాక్షి, నల్గొండ: అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే..బతుకంతా ధారపోసి జీవితమిచ్చేది మాత్రం నాన్నే. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడించేది.. కష్టాల్లో నిబ్బరంగా, ఆపదల్లో ధైర్యంగా నిలబడేలా చూసేది నాన్నే. కన్నబిడ్డ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే శ్రమజీవి నాన్నే. అందుకే.. నాన్న నీకు వందనం. నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఫాదర్స్ డేఏ సందర్భంగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తన తండ్రి నోముల నర్సింహయ్యను తలుచుకొని పాట పాడారు.. నా దారి నువ్వే నాన్నా.. నా ధైర్యం నువ్వే నాన్నా’ అంటూ పాట పాడారు. ఈ పాటను తనే స్వయంగా రాసి తండ్రికి అంకితం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే తన టట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘మా నాన్నకు అంకితం.. ప్రపంచంలోని నాన్నలందరికీ ఫాదర్స్‌డే శుభాకాంక్షలు’ అనిపేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాట జనాలకు ఆకట్టుకుంటోంది. చదవండి: Father's Day: తల్లి దూరమైన పిల్లలు.. అమ్మ కూడా... నాన్నే! A small dedication to my father..Happy father's day to all father's out there...#fathersday pic.twitter.com/xuUEXJtC3s — Nomula Bhagath Kumar (@BagathNomula) June 19, 2022 -
వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి
హాలియా : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అంతమొందించే వరకు కార్మికులు, కర్షకులు ఐక్యతతో పోరాడాలని, రైతుల పోరాటానికి మద్దతుగా వారిని చైతన్య పరిచేందుకు రైతన్న సినిమాను తీసినట్లు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. బుధవారం హాలియాలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కున్రెడ్డి నాగిరెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, కుర్ర శంకర్‌నాయక్, దుబ్బా రామచంద్రయ్య, జువాజీ వెంకటేశ్వర్లు, పొదిల వెంకన్న, రవినాయక్, యూసూబ్, శ్రీను, యాదయ్య, యడవెల్లి శ్రీను, ఎస్కె జానీపాషా, రవి, రవీందర్ తదితరులు ఉన్నారు. (చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం) ‘రైతన్న’ను ఆదరించాలి: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ సమాజహితం కోసం ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి నిర్మించిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కోరారు. బుధవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్ నారాయణమూర్తి ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన వ్యవసాయ విద్యుత్ సంస్కరణలను పునర్ సమీక్షించాలన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడడంతో పాటు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతన్న సినిమాను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వి«ధానాలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో అనుముల, తిరుమలగిరి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గౌరవసలహాదారు వెంపటి శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్, కౌన్సిలర్ వెంకటయ్య, నాయకులు చాపల సైదులు, సురభి రాంబాబు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, బందిలి సైదులు, రావుల లింగయ్య ఉన్నారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం -
ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భగత్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్ ఒకటిన నోముల నర్సింహయ్య మరణించడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్ టీఆర్ఎస్ అభ్యర్థిగాగా పోటీ చేసి గెలిచారు. -
KCR Strategy: సాగర్ బరి.. ‘సార్’ గురి!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.. చేదు అనుభవాలను అధిగమించింది.. తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుంటోంది. దుబ్బాక, గ్రేటర్ ఫోబియా నుంచి బయటపడి విజయాలబాట పట్టింది. నాగార్జున సాగర్ తీరాన మళ్లీ షి‘కారు’చేస్తోంది.. ఇటీవలి శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో సవాళ్లను దీటుగా ఎదుర్కొని సానుకూల ఫలితాన్ని సాధించింది. తాజాగా సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్కు గెలుపు టానిక్ అందించింది. దీని వెనుక ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వేసిన పక్కా ప్లాన్ ఉంది. పటిష్ట వ్యూహం ఉంది. ఉపఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే పార్టీ యంత్రాంగం సన్నద్ధత, సమన్వయానికి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతీరు పునరావృతం కాకుండా సాగర్ ఉపఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు. చదవండి: (సాగర్ తీర్పు: జానారెడ్డి షాకింగ్ నిర్ణయం) నివేదికలు.. సర్వేలు.. సన్నద్ధత గత ఏడాది డిసెంబర్ రెండోవారం నుంచే సాగర్ నియోజకవర్గంపై దృష్టి సారించిన కేసీఆర్ టీఆర్ఎస్ నేతలతోపాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకుని పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారు. సామాజికవర్గాల ఓటర్ల సంఖ్య, పార్టీ సంస్థాగత బలం, కాంగ్రెస్, ఇతర పార్టీల బలాబలాలు వంటి అంశాలను లోతుగా విశ్లేషించి వ్యూహాన్ని ఖరారు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటే సాగర్ ఉపఎన్నిక జరుగుతుందనే అంచనాతో సుమారు నాలుగు నెలల ముందు నుంచే పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేసే పనికి శ్రీకారం చుట్టారు. మండలాలవారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో సాగర్ ఉప ఎన్నికల ప్రచారాన్ని కూడా అంతర్భాగం చేశారు. చురుకైన ఎమ్మెల్యేలు.. మెరుగైన ప్రచారం.. సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అదే సామాజికవర్గాల ఎమ్మెల్యేలతోపాటు కొందరు చురుకైన ఎమ్మెల్యేల బృందానికి ప్రచార, సమన్వయబాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, శంకర్‌నాయక్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, ఎన్.భాస్కర్‌రావు, కోరుకంటి చందర్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావులను సాగర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరిని సమన్వయం చేసే బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ వివిధవర్గాల మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల వివరాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించారు. బహిరంగ సభల్లో వాటి పరిష్కారాలకు కేసీఆర్ హామీనిచ్చారు. అభ్యర్థి ఎంపిక.. విపక్షాలకు ముకుతాడు నర్సింహయ్య కుమారుడు భగత్‌తోపాటు సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డి, మరో అరడజను మంది నేతలు టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీపడ్డారు. అయితే, అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ చివరి నిమిషం వరకు గోప్యత పాటించారు. పార్టీలో ఏకాభిప్రాయం సాధించిన తర్వాత భగత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతోపాటు కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. జానా రెడ్డి నుంచి గట్టిపోటీ తప్పదని గ్రహించిన కేసీఆర్ ఆయనకు పట్టు ఉన్న సామాజికవర్గాలు, గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీజేపీ ప్రభావం పెద్దగా ఉండబోదని ముందే అంచనాకు వచ్చిన కేసీఆర్ ఆ పార్టీని మరింత బలహీనపర్చాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన కడారి అంజయ్య యాదవ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకొని కమలనాథులను ఆత్మరక్షణలోకి నెట్టారు. తన ప్రసంగాల్లో ఎక్కడా బీజేపీ పేరును ప్రస్తావించని కేసీఆర్, ఆ పార్టీకి డిపాజిట్ దక్కకుండా చేసి ‘సాగర్’వేదికగా చావుదెబ్బ కొట్టాలని భావించారు. ఈ మేరకు బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేశారు. దుబ్బాక, గ్రేటర్ హైదరా బాద్ ఫలితాలతో తలెత్తిన ఫోబియా నుంచి పార్టీ ని బయటకు తేవడంలో కేసీఆర్ సఫలమైనట్లు సాగర్ ఉపఎన్నిక ఫలితంతో తేటతెల్లమైంది. చదవండి: (సాగర్ టీఆర్ఎస్దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం) -
సాగర్ టీఆర్ఎస్దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో గులాబీ మళ్లీ గుబాళించింది. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో అది తన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని అది నిలబెట్టుకున్నట్లు అయింది. గత నెల 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించగా రెండు వారాల తర్వాత ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. చేజారిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు, తొలిసారి ఉనికి చాటుకోవాలని భావించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ తరఫున గెలిచిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ తన అభ్యర్థిగా నర్సింహయ్య తనయుడు భగత్‌ను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత కె.జానారెడ్డికి ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఈ ఎన్నికలో మొత్తం 2,20,206 ఓట్లకుగాను 1,90,861 ఓట్లు పోలయ్యాయి. నోముల భగత్‌కు 89,804 ఓట్లు, జానారెడ్డికి 70,932 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ 18,872 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలుపొందింది. కేవలం 7,676 ఓట్లను మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక్కడ మొత్తంగా 41 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్‌కుమార్‌కు 1,714 ఓట్లు వచ్చాయి. కాగా, నోటాకు 498 ఓట్లు పడ్డాయి. ‘జానా’కు నాలుగో ఓటమి తాజా ఓటమితో జానారెడ్డి తన రాజకీయ జీవితంలో ఇప్పటికీ నాలుగుసార్లు అపజయం పొందినట్లు అయింది. జానారెడ్డి వరుసగా రెండుసార్లు పరాజయం పాలవడం గమనార్హం. తన రాజకీయ జీవిత చరమాంకంలో ఆయనకు ఇది ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు. తొలిసారి 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోగా, 1994లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండోసారి, 2018 ఎన్నికల్లో మూడోసారి ఓటమి పాలయ్యారు. ఆయన విజయాల సంఖ్య ఏడు కాగా, ఓటముల సంఖ్య నాలుగుగా నమోదైంది. చదవండి: (సాగర్ తీర్పు: జానారెడ్డి షాకింగ్ నిర్ణయం) యాదవుల ఓట్లపై కన్ను.. తలసానికి బాధ్యత ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లున్న యాదవ సామాజికవర్గానికి చెందిన భగత్‌ను బరిలోకి దించిన నేపథ్యంలో వారి ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు తలసాని సాగర్‌లో మకాం వేసి నియోజకవర్గంలోని అన్ని మండలాల యాదవ సంఘాల నేతలతో సమావేశమై పూర్తి మద్దతును కూడగట్టారు. ఆయా కుల, ఉద్యోగ సంఘాలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏ వర్గాన్నీ విస్మరించకుండా ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. భగత్ అత్యధిక మెజారిటీ సాధించడానికి ఇవన్నీ దోహదం చేశాయని చెప్పవచ్చు. ఫలించిన .. సీఎం కేసీఆర్ వ్యూహం దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు రాకపోవడంతో సాగర్‌లో విజయం కోసం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా వ్యూహాన్ని రూపొందించారు. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉందనగా పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కనీసం నెలన్నర ముందు నుంచే పార్టీ శ్రేణులను ప్రచారంలోకి దింపారు. ఎమ్మెల్యేను ఇన్‌చార్జీలుగా నియమించి గ్రామాలకు పంపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రచారం చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారు పేరున విస్తృతంగా ప్రచారం చేసింది. మండలాల ఇన్‌చార్జీలుగా వచ్చిన ఎమ్మెల్యేలు (మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు) అభ్యర్థి పేరును ప్రకటించేసరికే పల్లెపల్లెనా తిరిగారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అభ్యర్థి భగత్ వెన్నంటే ప్రచారం చేశారు. ఉపఎన్నిక అనివార్యమయ్యాక ఫిబ్రవరిలో ఒకసారి, ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 14న మరోసారి సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించి, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. -
సాగర్ తీర్పు: జానారెడ్డి షాకింగ్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వయసురీత్యా రాజకీయాల నుంచి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తెలిపారు. తనకు ఇప్పుడు 75 ఏళ్లు ఉన్నాయని, అనూహ్య పరిస్థితులు ఏర్పడితే తప్ప మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటిం చారు. తనకు రాజకీయాలపై వైరాగ్యం లేదంటూనే, ఇంకా తాను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిచినా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడినని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు. తనపై విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను అభినందించారు. ఆదివారం సాగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు, ప్రజాస్వామ్య విలువల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. ఈ ఎన్నికల వల్ల కాంగ్రెస్ కోల్పోయింది ఏమీ లేదన్నారు. మున్ముందు ఎన్నికలు కూడా ఇలాగే ఉంటాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చదవండి: (సాగర్ టీఆర్ఎస్దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం) వైరాగ్యం ఏమీ లేదు.. 20 ఏళ్ల వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నానని, 11 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశానని జానారెడ్డి తెలిపారు. అయినా తనకు రాజకీయాలపై విరక్తి, వైరాగ్యం లేవని చెప్పారు. బీజేపీని నిర్మించిన ఎల్కే అద్వానీ లాంటి నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. తాను నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేయలేదనడంలో వాస్తవం లేదని, తాను శాశ్వత ప్రాతిపదికన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. తాత్కాలిక పథకాల వల్ల అభివృద్ధి జరగదనే విషయం కొంత కాలం తర్వాత ప్రజలకు అర్థమవుతుందన్నారు. తాను తన బయో గ్రఫీ రాసుకోనని, ఎవరైనా రాసేందుకు ముందుకు వస్తే అన్ని విషయాలు చెప్తానని తెలిపారు. అది హైకమాండ్ చూసుకుంటుంది టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ ఇష్టమని, అధ్యక్ష ఎంపిక వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని జానారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పార్టీ శ్రేణులన్నీ కలసి పనిచేశాయని చెప్పారు. అటు టీఆర్ఎస్ పార్టీ, ఇటు ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేసినా కాంగ్రెస్ సత్తా చాటిందని వ్యాఖ్యానించారు. ఈ ఉత్సాహంతోనే కాంగ్రెస్ శ్రేణులు మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తనకు ఇప్పటివరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా నెమ్మదించిన తర్వాత అందర్నీ కలుస్తానని చెప్పారు. -
ఈ విజయం కేసీఆర్‌కు అంకితం: నోముల భగత్
నాగార్జునసాగర్: ఉప ఎన్నికలో తనను గెలిపించిన ఓటర్లకు, నాగార్జునసాగర్ ప్రజలకు విజేత నోముల భగత్ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు నా పాదాభివందనం అని తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని చెప్పారు. నాన్న ఆశయాలు నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విజయం కేసీఆర్‌కు అంకితం అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని తెలిపారు. విజయంతో పొంగిపోవడం లేద: మంత్రి సాగర్ నియోజకవర్గంలో 19 వేలకు పైగా మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం సీఎం కేసీఆర్ పట్ల నమ్మకానికి, నాయకత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యానికి కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నోటికి వచ్చినట్లు మాట్లాడాయని తెలిపారు. ఈ విజయంతో పొంగిపోవడం లేదు అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారని గుర్తుచేశారు. 60 ఏళ్లలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడ్డ నల్గొండ జిల్లా తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి తెచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నాగార్జునసాగర్‌పై గెలుపుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ ఫలితాలను చూసైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరు అని కొట్టిపడేశారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రం నుంచి రావాల్సిన వాటికోసం పోరాడండి అని సూచించారు. వాక్సిన్లు, రిమిడిసివర్ ఇంజక్షన్లు తేవడంలాంటివి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు, అబద్ధాలు చెప్పారు అని గుర్తు చేశారు. విషబీజాలు నాటితే ప్రజలు విశ్వసించరు అని పేర్కొన్నారు. ప్రతి మండలంలో టీఆర్ఎస్ఖే స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని చెప్పారు. చదవండి: బెంగాల్ తీర్పుతో బీజేపీ తెలుసుకోవాల్సింది -
జానాకు షాక్.. ఒక్కరౌండ్‌లో మాత్రమే...!
సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వరుస రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటి వరకు కేవలం ఒక్క 14వ రౌండ్లో మాత్రమే ఆధిక్యంలోకి వచ్చారు. జానాకు కంచుకోటగా ఉన్న సాగర్‌లో టీఆర్ఎస్ మరోసారి సత్తాచాటింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పోటీచేసిన జానారెడ్డి దివంగత నోముల నర్సింహయ్య చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిదే. ఇక ప్రస్తుత కౌంటింగ్ సరళి చూస్తుంటే కారు పార్టీకి షాకిస్తామని ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్ చతికిలపడ్డట్టు స్పష్టమవుతోంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన నిజం చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మంచి మెజారీటీతో దూసుపోతున్నారు. నోముల భగత్‌ను వ్యూహాత్మంగా సాగర్ బరిలో దించిన టీఆర్ఎస్ ఓటర్ల దృష్టిని తమవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. తండ్రి నోముల నర్సింహయ్యపై ఉన్న అభిమానాన్ని ప్రజలు భగత్‌పైనా చూపించారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టిపోటీచ్చిన బీజేపీ సాగర్‌లో గెలవాలని చాలా ప్రయత్నాలే చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో అధికార టీఆర్ఎస్ బలం ముందు కాషాయదళం తేలిపోయింది. ఇప్పటివరకు 19 రౌండ్ల కౌంటింగ్ జరగ్గా ఒక్క రౌండ్లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేదు. టీఆర్ఎస్ 14వేల ఓట్ల మెజారీతో తొలి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన అధికార టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్నికలో వ్యూహాత్మంగా వ్యవహరించింది. చివరివరకు అభ్యర్థిని ప్రకటించడకుండా ఆఖరి క్షణంలో నరసింహయ్య కొడుకునే బరిలోకి దించింది. తద్వారా ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందకుండా జాగ్రత్త పడింది. జానా కోటలో పాగా వేసేందుకు మరోసారి సిద్ధమైంది! -
కరోనా కల్లోలం రేపిన ‘నాగార్జునసాగర్ సభ’
నల్లగొండ: ఉప ఎన్నిక సందర్భంగా నాగార్జునగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభ కరోనా వైరస్ విజృంభణకు కేంద్రంగా నిలిచింది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ సాగర్ అభ్యర్థి నోముల భగత్‌తో పాటు అక్కడి కీలక టీఆర్ఎస్ నాయకులకు కరోనా సోకింది. దీంతో పాటు ఆ బహిరంగ సభకు హాజరైన వారిలో చాలామందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఒక్కరోజే కేవలం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 160 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా ఈనెల 17వ తేదీన ఉప ఎన్నిక ఉండడంతో ఈసారి గెలుపు కోసం టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఈనెల 14వ తేదీన హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న వేళ అందరూ సభ వద్దన్నా కూడా నిర్వహించారు. ఆ సభ వలనే సీఎంతో పాటు ఆ పార్టీ అభ్యర్థికి ఇతర ముఖ్య నాయకులకు కరోనా సోకిందని నిఘా వర్గాలు గుర్తించాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్‌తో పాటు అతడి కుటుంబసభ్యులకు, టీఆర్ఎస్ సాగర్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకు కూడా పాజిటివ్ తేలింది. ఆ బహిరంగ సభకు కేసీఆర్‌తో పాటు వీరంతా హాజరైన వారే. సభకు వచ్చిన వారిలో కరోనా బాధితులు ఉండడంతోనే అందరికీ వ్యాపించిందని తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్, బీజేపీ నేతలకూ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా కూడా కరోనా తీవ్రంగా విజృంభిస్తోందని తేలింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు గుమికూడడం, ప్రజలను కలవడం.. కరోనా నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలతో సాగర్ నియోజకవర్గంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మాస్క్‌లు ధరించినా భౌతిక దూరం విస్మరించడం వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. శానిటైజర్ వినియోగం కూడా అంతంతమాత్రమేనని సమాచారం. చదవండి: కేసీఆర్‌కు కరోనా.. కేటీఆర్, కవిత భావోద్వేగం -
నోముల భగత్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, నల్లగొండ: నాగార్జున సాగర్‌లో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు మరి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాక పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కరోనా కేసులు నమోదయ్యాయి. చదవండి: లాక్‌డౌనా.. కర్ఫ్యూనా.. 48 గంటల్లోగా తేల్చండి: హైకోర్టు -
నోముల భగత్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన పబ్లిసిటీని పెంచుకుంటారు. ఓ వైపు సంచలన సినిమాలను తీస్తూ, మరోవైపు పలు రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ ఆభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు ఓటు హక్కు ఉంటే సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆభ్యర్థి నోముల భగత్‌కే ఓటు వేస్తానని ఆర్జీవీ అన్నారు. ఈ మేరకు చిరుతపులితో నోముల భగత్ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అదే విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను సింహంతో పోల్చారు. చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళుతున్న నోముల భగత్‌ను తాను ఇష్టపడుతున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నోములు భగత్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నోముల భగత్ తండ్రి నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే. ఇక రామ్ గోపాల్‌వర్మ నేతృత్వంలో తెరకెక్కుతున్న ‘డీ కంపెనీ’ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. The candidate @BagathNomula says “VOTE FOR US, that is ME and TRS —WE WILL ROAR in NAGARJUNA SAGAR byelection and no other party can DAM us” —and me saying Not in world history I saw a candidate campaigning with a chained CHEETAH 😘😍💐💃 Hats off to #KCR and @KTRTRS pic.twitter.com/d9Tpu8ebMa — Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021 VAAMMO we know #KCR and @KTRTRS are TIGER and LION but I love this candidate @BagathNomula who is taking a CHEETAH for a walk ..If I had a VOTE I will vote for this REAL HERO on 17th by-election of Nagarjuna Sagar pic.twitter.com/sYETa51Zq0 — Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021 -
Nagarjuna Sagar Bypoll: గులాబీ ‘సాగర’ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార టీఆర్ఎస్ ఇక ‘ఆపరేషన్ నాగార్జున సాగర్’ ప్రారంభించింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించడమే లక్ష్యంగా గులాబీదళం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ప్రచారం ముగియడానికి ముందురోజు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 14న బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపాయి. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా రెండ్రోజులపాటు రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే రోడ్ షోలు ఎక్కడెక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్నది ఖరారు కానుంది. ఇక భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించింది. సోమవారం రాత్రే హాలియా చేరుకున్న తలసాని... స్థానిక నేతలతో చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఫోన్ చేయడంతో సాగర్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న గురవయ్య యాదవ్, రంజిత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను బుజ్జగించారు. భగత్‌కు టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని వారికి వివరించారు. రెండ్రోజుల్లో వారిని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి భరోసా ఇప్పించే ప్రయత్నాల్లో తలసాని ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గంలో పర్యటించాలని, భగత్ గెలుపు కోసం పనిచేయాలని తెలంగాణ భవన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చదవండి: మంత్రిగా పనిచేశాడు.. సొంత వాహనం కూడా లేదు! సాగర్ ఉప ఎన్నిక.. చివరి రోజు నామినేషన్లు వేసిందేవరంటే.. -
సాగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
సాక్షి, నల్గొండ: నాగర్జున సాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కాసేపట్లో భగత్‌కు సీఎం కేసీఆర్ బీ-ఫామ్ అందజేయనున్నారు. రేపు ఉదయం భగత్ తన నామినేషన్ వేయనున్నారు. కాగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. ఇక బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. కాగా ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్ఎస్) ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. చదవండి: ఇలాంటి సవాల్ చేసిన చరిత్ర దేశంలో నా ఒక్కడిదే