ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణ స్వీకారం | Nomula Bhagath Sworn In As Nagarjuna Sagar MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణ స్వీకారం

Published Thu, Aug 12 2021 11:33 AM | Last Updated on Sun, Oct 17 2021 4:15 PM

Nomula Bhagath Sworn In As Nagarjuna Sagar MLA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి భగత్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు  తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

గతేడాది డిసెంబర్‌ ఒకటిన నోముల నర్సింహయ్య మరణించడంతో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగాగా పోటీ చేసి గెలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement