
సాక్షి, నల్గొండ: అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే..బతుకంతా ధారపోసి జీవితమిచ్చేది మాత్రం నాన్నే. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడించేది.. కష్టాల్లో నిబ్బరంగా, ఆపదల్లో ధైర్యంగా నిలబడేలా చూసేది నాన్నే. కన్నబిడ్డ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే శ్రమజీవి నాన్నే. అందుకే.. నాన్న నీకు వందనం. నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం.
ఫాదర్స్ డేఏ సందర్భంగా నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తన తండ్రి నోముల నర్సింహయ్యను తలుచుకొని పాట పాడారు.. నా దారి నువ్వే నాన్నా.. నా ధైర్యం నువ్వే నాన్నా’ అంటూ పాట పాడారు. ఈ పాటను తనే స్వయంగా రాసి తండ్రికి అంకితం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే తన టట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘మా నాన్నకు అంకితం.. ప్రపంచంలోని నాన్నలందరికీ ఫాదర్స్‌డే శుభాకాంక్షలు’ అనిపేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాట జనాలకు ఆకట్టుకుంటోంది.
చదవండి: Father's Day: తల్లి దూరమైన పిల్లలు.. అమ్మ కూడా... నాన్నే!
A small dedication to my father..Happy father's day to all father's out there...#fathersday pic.twitter.com/xuUEXJtC3s
— Nomula Bhagath Kumar (@BagathNomula) June 19, 2022