అప్పుల బాధకి మరో అన్నదాత బలయ్యాడు.
అప్పుల బాధకి మరో అన్నదాత బలయ్యాడు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి(45) అనే రైతు వారం రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యలు అతడిని చికిత్సకోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అతను గురువారం మరణించాడు. రాజిరెడ్డి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.