కరీంనగర్ జిల్లాలో సాగు కోసం చేసిన అప్పులు ఓ రైతు ఆత్మహత్యకు దారితీశాయి.
ముత్తారం: సాగు కోసం చేసిన అప్పులు ఓ రైతు ఆత్మహత్యకు దారితీశాయి. కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన నూనేటి పర్వతాలు (45) తనకున్న మూడెరాలతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేశాడు.
నీటి కోసం బావి తవ్వించిన ఫలితం లేకపోవడంతో.. ఐదు బోర్లు వేయించాడు. అయినా చుక్కనీరు పడలేదు. దీంతో సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. వీటిని తీర్చలేని పరిస్థితిని తలచుకుని మనస్తాపం చెందిన పర్వతాలు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.