కోటగిరి (నిజామాబాద్ జిల్లా) : కోటగిరి ఎమ్మార్వో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుశీల అనే ప్రభుత్వ ఉద్యోగిని.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇస్మాయిల్ అనే వ్యక్తి గతంలో ఆర్‌ఐగా పనిచేసి రిటైర్ అయ్యాడు.
అయితే ఇస్మాయిల్‌కు సంబంధించిన ఇంక్రిమెంట్ ఫైల్ మూవ్ చేయటానికి సుశీల రూ.2 వేలు లంచం అడిగింది. దీంతో ఇస్మాయిల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇస్మాయిల్ దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా సుశీలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.