జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్‌ | Sreeja Konidela Instagram Story Goes Viral | Sakshi
Sakshi News home page

Sreeja Konidela: జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్‌

Published Sun, Nov 5 2023 12:52 PM | Last Updated on Sun, Nov 5 2023 2:03 PM

Sreeja Konidela Instagram Story Goes Viral - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్‌ 1న ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఆ పెళ్లి వేడుకలో మెగా- అల్లు కుటుంబాలు సందడి చేశాయి.  ఈ వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. తాజాగా వారందరూ ఇటలీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వరుణ్‌ వివాహ వేడుకలో తన పిల్లలతో సందడి చేసిన మెగాస్టార్‌ కూతురు శ్రీజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది.

(ఇదీ చదవండి: గుంటూరు కారం ఫస్ట్‌ సాంగ్.. మహేశ్‌ ఫ్యాన్స్‌కు మసాల బిర్యానీ రెడీ)

'విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినప్పుడు హృదయం గాయపడటంతో పాటు విరిగిపోతుంది, మనస్సు కలత చెంది ఆపై క్షీణిస్తుంది. ఆ సమయంలో శరీరం అలసిపోయి బలహీనం అవుతుంది. జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనసులో బాధగా ఉన్నా... గుండె బద్దలైనా, పరిస్థితి చేజారినా కూడా ఒక్కసారి కళ్లు మూసుకుని మనలోపలికి మనం వెళ్తే అన్నీ సెట్ అవుతాయ్. అని శ్రీజ తెలిపింది. కష్టాల సమయంలో మనందరి ముందు ఉన్న ఏకైక దారి కూడా అదే అంటూ చెప్పుకొచ్చిన శ్రీజ..  ఈ పోస్ట్‌కు మాత్రం కామెంట్‌లను డిజబుల్ చేసింది.

2016లో కల్యాణ్‌ దేవ్‌తో శ్రీజ వివాహం జరిగిన విషయం తెలిసిందే.. వరుణ్‌ పెళ్లిలో శ్రీజ, నవిష్కలు ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు వైరల్‌ అవుతున్న సమయంలో.. తన కూతురిని మిస్ అవుతున్నట్టుగా కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు స్టోరీలు పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. శ్రీజ పోస్ట్‌ చేసిన విషయాన్ని పలువురు షేర్‌ చేస్తూ ఎంతో పాజిటివ్‌గా రెస్పాన్స్‌ ఇస్తున్నారు. జీవితంలో అన్నీ ఉంటాయి.. కానీ వాటినీ స్వీకరించక తప్పదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement