Kalyan Dev: Super Machi Teaser Release On Diwali - Sakshi
Sakshi News home page

Kalyan Dev: ఆకట్టుకుంటున్న కల్యాణ్‌ దేవ్‌ ‘సూపర్‌ మచ్చి’ టీజర్‌

Published Fri, Nov 5 2021 4:45 PM | Last Updated on Fri, Nov 5 2021 5:33 PM

Kalyan Dev Super Machi Teaser Release On Diwali - Sakshi

‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌.. చాలా గ్యాప్‌ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సూపర్ మచ్చి , కిన్నెరసాని అనే సినిమాలను చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా కల్యాన్‌ దేవ్‌ ‘సూపర్ మచ్చి’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.  ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

పులివాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.  మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు బలం కానున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్‌కు జోడిగా కన్నడ నటి రచితా రామ్ నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, నరేశ్‌, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా అజయ్‌, ‘జబర్దస్త్’ మహేశ్‌తో పాటు తదితర నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement