
సాక్షి, హైదరాబాద్ : చిరంజీవి చిన్న అల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్ కరోనా నుంచి బయట పడ్డారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ కళ్యాణ్ దేవ్‌కు తాజాగా కోవిడ్ నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపిన ఆయన అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఇక విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం అవికా గోర్ సరసన సూపర్ మచ్చి సినిమాలో నటిస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.
చదవండి : వ్యాక్సిన్ వేయించుకున్న పాయల్.. ఈసారి ఏం చేసిందంటే..
కరోనాతో 'చిచోరే' నటి మృతి
Comments
Please login to add a commentAdd a comment