
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పర్సనల్ లైఫ్‌పై ఇప్పుడు రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వీరిద్దరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అటు కల్యాణ్ దేవ్ కానీ, ఇటు శ్రీజ కానీ.. ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెట్టిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14) పురస్కరించుకొని ప్రేమపై ఈ జంట విడి విడిగా పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాలెంటైన్స్ డే విషెస్ తెలుపుతూ కల్యాణ్ దేవ్ ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం’ అని అందులో రాసుకొచ్చాడు.
మరోవైపు శ్రీజ కొణిదెల ప్రేమ గురించి చెబుతూ.. ‘లవ్ అంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు.. తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతకకూడదు’ అని చెప్పుకొచ్చింది.
ఈ రెండు పోస్టులు చూస్తుంటే ఒకరిపై ఒకరు కౌంటర్‌గా ఇలా చేశారనే విషయం అర్థమవుతుంది. అసలు వీరిద్దరు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై ఇప్పటికీ ఈ జంట స్పందించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment