మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా.. క్షణాల్లో వైరల్ అవుతోంది. దానికి కారణం ఆమె పర్సనల్ లైఫ్‌లో విబేధాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా ‘ ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా’ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. చివరకు ఆమె 'ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ప్' అంటూ సెల్ఫ్ లవ్ కంటే గొప్పది ఏదీ లేదన్నట్టుగా రాసుకొచ్చి అందరికి షాకిచ్చింది.
తాజాగా తన కాఫీ అలవాటు గురించి శ్రీజ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘నా అల్లరికి ప్రశాంతతను నువ్వే ఇస్తావ్.. జీవితంలో చీకటికి నువ్వే వెలుగులు నింపుతావ్.. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే.. నా 14 ఏళ్ల వయసులో నువ్వు(కాఫీ) పరిచయం అయ్యావ్. అప్పటి నుంచీ నాతోనే ఉంటున్నావ్.. థాంక్యూ మై డియర్ కాఫీ’ అంటూ తాను కాఫీ లవర్‌ని అని శ్రీజ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment