మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ ప్రస్తుతం కూతురితో కలిసి ఉంటోంది. భర్త కల్యాణ్ దేవ్.. శ్రీజ దగ్గర కాకుండా తన ఇంట్లో ఉంటున్నాడు. వీళ్లిద్దరూ అధికారికంగా బయటకు చెప్పలేదు గానీ విడాకులు తీసుకున్నారనే టాక్ చాలారోజుల నుంచి వినిపిస్తోంది. గతంలో వీళ‍్లిద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే దీనికి ఉదాహరణ. సరే అది పక్కనబెడితే కల్యాణ్ దేవ్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ మాత్రం అతడి బాధని చెబుతోంది.
(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)
కారణం ఏంటో మరి
చిరంజీవికి ఇద్దరు కుమార‍్తెలు. అందులో పెద్దమ్మాయి సుస్మిత ఓవైపు స్టైలిష్ట్, మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంది. రెండో కూతురు శ్రీజ గతంలో ఓసారి పెళ్లి చేసుకుని అతడి నుంచి విడిపోయింది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధంగా కల్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకుంది. వీళ్లకు కూడా ఓ పాప పుట్టింది. కారణమేంటో తెలియదు గానీ భార్యభర్తలు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు.
వారంలో ఒక్కసారే
పాప నవిష్క.. ప్రస‍్తుతం తల్లి శ్రీజ దగ్గరే ఉంటోంది. వారంలో ఓసారి అది కూడా నాలుగు గంటలు తండ్రి దగ్గరకి వస్తోంది. ఈ మధ్యే కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. తాజాగా కల్యాణ్ తన తల్లి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆమెకు విషెస్ చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో కూతురి గురించి చెప్పుకొచ్చాడు. 'మిస్ యూ మై బేబీ' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూస్తుంటే.. ప్రతివారం నవిష్కని కలుస్తున్నాసరే కల్యాణ్ దేవ్ ఆమెని మర్చిపోలేకపోతున్నాడని అర్థమవుతోంది.
(ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!)
Comments
Please login to add a commentAdd a comment