Srija child
-
ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!
మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ ప్రస్తుతం కూతురితో కలిసి ఉంటోంది. భర్త కల్యాణ్ దేవ్.. శ్రీజ దగ్గర కాకుండా తన ఇంట్లో ఉంటున్నాడు. వీళ్లిద్దరూ అధికారికంగా బయటకు చెప్పలేదు గానీ విడాకులు తీసుకున్నారనే టాక్ చాలారోజుల నుంచి వినిపిస్తోంది. గతంలో వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే దీనికి ఉదాహరణ. సరే అది పక్కనబెడితే కల్యాణ్ దేవ్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ మాత్రం అతడి బాధని చెబుతోంది. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) కారణం ఏంటో మరి చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్దమ్మాయి సుస్మిత ఓవైపు స్టైలిష్ట్, మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంది. రెండో కూతురు శ్రీజ గతంలో ఓసారి పెళ్లి చేసుకుని అతడి నుంచి విడిపోయింది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధంగా కల్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకుంది. వీళ్లకు కూడా ఓ పాప పుట్టింది. కారణమేంటో తెలియదు గానీ భార్యభర్తలు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. వారంలో ఒక్కసారే పాప నవిష్క.. ప్రస్తుతం తల్లి శ్రీజ దగ్గరే ఉంటోంది. వారంలో ఓసారి అది కూడా నాలుగు గంటలు తండ్రి దగ్గరకి వస్తోంది. ఈ మధ్యే కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. తాజాగా కల్యాణ్ తన తల్లి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆమెకు విషెస్ చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో కూతురి గురించి చెప్పుకొచ్చాడు. 'మిస్ యూ మై బేబీ' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూస్తుంటే.. ప్రతివారం నవిష్కని కలుస్తున్నాసరే కల్యాణ్ దేవ్ ఆమెని మర్చిపోలేకపోతున్నాడని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) (ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!) -
శ్రీజకు ప్రభుత్వం అండ
రేగిడి: రేగిడి ఆమదాలవలస మండలం నాయిరాల వలస గ్రామానికి చెందిన తలసేమియా బాధితురాలు కొవ్వాడ శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. ఈ నెల 6వ తేదీన సాక్షి దిన పత్రికలో ‘చిన్నారి ప్రాణానికి ఆపద’ అనే శీర్షికపై వెలువడిన కథనానికి దాతలతోపాటు ప్రభుత్వం నుంచి కూడా స్పందన లభించింది. సీఎం కార్యాలయం నుంచి శ్రీజ తల్లి జ్యో తితో ఫోన్లో మాట్లాడారు. శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పారని జ్యోతి ఆదివారం ‘సాక్షి’కి వెల్లడించారు. కుమార్తె అనారోగ్య స్థితిని, మెడికల్ సరి్టఫికెట్లను సీఎం కార్యాలయానికి పంపించామని ఆమె తెలిపారు. జిల్లాలోనూ చాలా మంది మానవతావాదులు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, సాయం కూడా చేశారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న చిన్నారి శ్రీజ
సాక్షి,తిరుమల: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ కోలుకున్న చిన్నారి శ్రీజ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఖమ్మం జిల్లా పాల్వాంచ మండలానికి చెందిన శ్రీజ బ్రెయిన్‌ట్యూమర్‌తో బాధపడుతున్న సమయంలో హీరో పవన్‌కల్యాణ్‌ను చూడాలని కోరుకుంది. ఆమె విజ్ఞప్తి మేరకు పవన్ ఆసుపత్రికి వచ్చి త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. అప్పటికి ఆమె స్పృహలో కూడా లేదు. ప్రస్తుతం శ్రీజ కోలుకుంది. ఈ నేపథ్యంలో గురువారం కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకుంది.