టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. విజేత సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలతో మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజను.. కల్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం శ్రీజ, కల్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నారు.
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కల్యాణ్ దేవ్ తన ఫ్యాన్స్‌కు విషెస్ తెలిపారు. తన కూతురు నవిష్కతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. మమ్మల్ని అదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది చూసిన అభిమానులు సైతం హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ఇటీవలే నవిష్క ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. నవిష్క బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment