
మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ కొణిదెల కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమె పర్సనల్ లైఫ్‌లో రకరకాల రూమర్స్ తెరమీదకి వస్తున్నాయి. భర్త కల్యాణ్ దేవ్‌తో ఆమె వైవాహిక జీవితంపై పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా శ్రీజ షేర్ చేసిన పోస్ట్ మరింత అనుమానాలకు తావిస్తుంది.
న్యూఇయర్ సందర్భంగా గతేడాది జరిగిన మూమెంట్స్‌ని షేర్‌చేస్తూ.. ''డియర్ 2022, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశేలా చేశావ్. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమిస్తూ, కేరింగ్‌గా చూసుకుంటూ, కష్టసుఖాల్లో నాకు తోడుంటే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలబడే వ్యక్తి.. తనను కలుసుకోవడం అద్భుతం. కొత్త ప్రయాణం మొదలవుతుంది'' అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.
ఇక ఈమధ్యకాలంలో శ్రీజ, కల్యాణ్‌దేవ్‌లు కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. రీసెంట్‌గాకూతురి బర్త్‌డేను సైతం శ్రీజ ఒక్కతే సెలబ్రేట్ చేసింది. ఈ క్రమంలో 'కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నా' అంటూ శ్రీజ వెల్లడించడం అటు మెగా అభిమానులతో పాటు నెటిజన్లలోనూ ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment