కూతురితో కలిసి వేడుకలో పాల్గొన్న కల్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్! | Tollywood Hero Kalyan Dev Post Goes Viral On Social Media Over His Sister Baby Shower - Sakshi
Sakshi News home page

Kalyan Dev: సీమంతం వేడుకలో కల్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్!

Published Thu, Dec 21 2023 9:30 PM | Last Updated on Fri, Dec 22 2023 11:40 AM

Tollywood Hero Kalyan Dev Post Goes Viral In Social Medai - Sakshi

టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ తెలుగువారికి సుపరిచితమే. మెగా అ‍ల్లుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. అయితే ప్రస్తుతం కల్యాణ్ దేవ్ ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ నవిష్క అనే కూతురు ఉంది.
 
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే కల్యాణ్‌ దేవ్‌ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఉంటున్న కల్యాణ్‌ దేవ్ గతంలో తన తల్లి బర్త్‌డే జరుపుకున్న ఫోటోలను పంచుకున్నారు. అలాగే తాజాగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా తన చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకలో పాల్గొన్న ఫోటోలను కల్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వేడుకలో తన కూతురు నవిష్కతో కలిసి పాల్గొన్నారు. మీ అందరి ప్రేమ, అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతోంది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ్ దేవ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement