
Kalyan Dev Super Machi Movie Trailer Out: మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న సూపర్ మచ్చి సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. హీరో ఎంట్రీ ఆకట్టుకుంటుంది. 'వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సీతవు అవుతావో లేదో నాకు తెలియదు గానీ, వాడు మాత్రం రాముడు అవుతాడమ్మా' అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహించగా, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ దేవ్‌కు జోడీగా కన్నడ నటి రచితా రామ్ నటించింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేశ్, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment