మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా సూపర్ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్ తరచూ వెకేషన్స్‌కు వెళ్తున్నాడు. అంతేగాక ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్యే తన మేకోవర్ లుక్‌ని షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి ‘నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్. నీకు నచ్చింది నువ్వు చెయ్’ అంటూ కొటేషన్‌ను యాడ్ చేశాడు.
చదవండి: Pooja Hegde: పూజ నోట అసభ్య పదం, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఇక తాజాగా వీకెండ్ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘శనివారం నుంచి సోమవారం మధ్యలో’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా కల్యాణ్ వీకెండ్‌లో ఎలా ఉంటాం.. వీకెండ్ అయిపోయాక మండే రోజు ఎలా ఉంటాం.. మూడ్ ఎలా మారుతుంది అంటూ డిఫరెంట్ మూడ్‌తో ఉన్న ఫొటోలను పంచుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే నెట్టింట రకారకాల పుకార్లు వస్తున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ పెట్టే ప్రతి పోస్ట్ ఆసక్తిని సంతరించుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం కల్యాణ్ తన మూడవ సినిమా ‘కిన్నెర సాని’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు.
చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment