కల్యాణ్ దేవ్
చిరు ఇంటి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. మామ చిరంజీవి సక్సెస్‌ఫుల్ టైటిల్‌తో సిల్వర్ స్క్రీన్‌కి ఎంటరైన కల్యాణ్ ఇప్పుడు రెండో సినిమాకి సైన్ చేశారు. ఈ సినిమా కోసం కాస్త గడ్డం పెంచి కొత్త లుక్‌లోకి వచ్చేశారీ యువహీరో. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా పులి వాసు దర్శకునిగా పరిచయం అవ్వనున్నారు. ఖుర్షీద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. ‘‘త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం. రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళి, ప్రగతి కీలక పాత్రల్లో నటిస్తారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాత రిజ్వాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment