Ram Charan To Launch Brother-In-Law Kalyaan Dhev’s Theme of Kinnerasani Movie - Sakshi
Sakshi News home page

బావకు అండగా రామ్‌ చరణ్.. థీమ్‌ ఆఫ్‌ కిన్నెరసాని!

Published Thu, Feb 11 2021 1:29 PM | Last Updated on Thu, Feb 11 2021 2:59 PM

Ram Charan Release Kalyan Dev Theme Of Kinnerasani Video - Sakshi

విజేత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు క‌ళ్యాణ్ దేవ్. ప్ర‌స్తుతం ఆయన కిన్నెర‌సాని అనే సినిమా చేస్తున్నాడు. వైవిధ్యమైన టైటిల్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'కిన్నెరసాని' టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు ఫిబ్రవరి 11న కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి థీమ్ వీడియోను మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. ఇందులో కాలిపోతున్న కాగితం గాలిలో ఎగురుతూ వచ్చిరోడ్డు మీద పడుతోంది. అందులో నుంచి అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. అయితే ఆ ఫోటోలో అమ్మాయి ఎవరనే విషయం మాత్రం తెలియదు. అదే సమయంలో వర్షం పడటం.. చివ‌ర‌లో క‌ళ్యాణ్ దేవ్ ఫొటో చూపించ‌డం ఆకట్టుకునేలా ఉంది.

థీమ్ వీడియో చూస్తుంటే సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. చివర్లో కళ్యాణ్ దేవ్ లుక్ భయం కలిగించేలా ఉంది. మొత్తానికి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్తో కళ్యాణ్ దేవ్ కొత్తగా కనిపిస్తున్నాడు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయి రిషిక సమర్పణలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్టైన్‌మెంట్‌‌, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం. అలానే ఛ‌లో, భిష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అలరిస్తుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.
చదవండి: అరుదైన గౌరవం: అనసూయ ఫోటోతో పోస్టల్‌ స్టాంప్‌
పుష్ప: హాలీవుడ్‌ తరహాలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement