Kalyan Dhevs Kinnerasani Teaser Launched By Nithin - Sakshi
Sakshi News home page

Kinnerasani:‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి'

Published Sat, Aug 28 2021 1:19 PM | Last Updated on Sat, Aug 28 2021 3:54 PM

Kalyaan Dhevs Kinnerasani Teaser Launched By Nithin - Sakshi

'విజేత' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు క‌ల్యాణ్ దేవ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఈ మెగా హీరో ప్రస్తుతం కిన్నెర‌సాని అనే సినిమాలో నటిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది క్యాప్షన్‌. తాజాగా ఈ మూవీ టీజర్‌ను హీరో నితిన్‌ విడుదల చేశారు.  

‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి, ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీ దానికి ఓ లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా..ప్రేమ‌కైనా'.. అనే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా టీజర్‌ ఆద్యంతం స‌స్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  అన్ శీత‌ల్  ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. మ‌హతి స్వ‌ర‌సాగ‌ర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. 

చదవండి :మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ 
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ కూతురు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement