త్రిష, టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు టొవినో థామస్. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతని స్కెచ్ వేస్తారా? అని టొవినోకు చెబుతున్నట్లుగా టీజర్‌లో కనిపిస్తోంది. టొవినోకు ఆ నేరస్తుడి ముఖాకృతిని త్రిష వివరిస్తుంటారు. వచ్చే జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment