![kalyan dev, sridhar sisana new movie announced - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/6/kalyan.jpg.webp?itok=F_3hid5u)
కల్యాణ్ దేవ్
‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయమయిన చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తన మూడో చిత్రం కూడా ఖరారైంది. ‘దూకుడు, నమోః వెంకటేశాయ, పూలరంగడు, లౌక్యం’ వంటి సినిమాలకు కథ, మాటలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ–‘‘రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను నేను దర్శకుడిగా పరిచయం కావడానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కథకు కళ్యాణ్ దేవ్ సరైన కథానాయకుడనిపించింది. ప్రేమతో కూడిన వినోదభరితమైన చిత్రం ఇది. నాపై నమ్మకం ఉంచి, దర్శకునిగా అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతల గౌరవాన్ని పెంచగలననే నమ్మకం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment