Kalyan Dev Emotional Post on Her Daughter Navishka - Sakshi
Sakshi News home page

చాలా మిస్‌ అవుతున్నాను.. కూతుర్ని తలచుకుంటూ కల్యాణ్‌ దేవ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sun, Feb 12 2023 2:41 PM | Last Updated on Sun, Feb 12 2023 3:32 PM

Kalyan Dev Emotional Post On Her Daughter Navishka - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ పేరు ఇటీవల సోషల్‌ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతోంది. దానికి కారణం అతని పర్సనల్‌ లైఫ్‌లో విభేదాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్‌ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి.

తాజాగా కూతురు నవిష్కను  గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు కల్యాణ్‌ దేవ్‌. ఫిబ్రవరి 11న కల్యాణ్‌ దేవ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా గతంలో కూతురితో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుపుకున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘నీతో కలిసి ఇలా సెలబ్రేట్‌ చేసుకోవడం ఇది నాలుగోసారి. నా బర్త్‌డేను ఇంతకంటే గొప్పగా స్టార్ట్‌ చేయలేను. ప్రతిరోజూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటికే నిన్ను మిస్‌ అవుతున్నా’అంటూ కల్యాణ్‌ దేవ్‌ రాసుకొచ్చాడు.  ఇటీవల జరిగిన  కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కల్యాణ్‌ దేవ్‌ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement