Chiranjeevi Son-In-Law Kalyaan Dhev Emotional Post Goes Viral - Sakshi
Sakshi News home page

నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా.. కల్యాణ్‌ దేవ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

Published Sun, Jan 1 2023 8:44 AM | Last Updated on Sun, Jan 1 2023 10:43 AM

Kalyan Dev Emotional Post Goes Viral - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ పేరు ఇటీవల సోషల్‌ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతోంది. ఆయన ఏ పోస్ట్‌ పెట్టినా.. నెటిజన్స్‌ ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల ఆయన ‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.  ఈ పోస్ట్ చూసిన వారంతా కళ్యాణ్ ఎందుకు అలా పెట్టాడు?  ఈ పోస్ట్‌ వెనక అంతర్యం ఏంటి? పర్సనల్‌ లైఫ్‌లో విభేదాలు వచ్చాయా?’అని ఆరా తీశారు. ఇక న్యూ ఇయర్‌ సందర్భంగా ఆయన పెట్టిన మరో పోస్ట్‌ కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

‘2022లొ చాలా నేర్చుకున్నాను. సహనంగా ఎలా ఉండాలో తెలిసివచ్చింది. ఎదుగుదల అంటే ఏంటో తెలిసింది.. అవకాశాలను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఇతరులను క్షమించడం.. నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యావాదలు. మీ అందరి ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రయత్నించడం… ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దూ.. మీ అందరికీ ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, సాహసం, విజయం, మీరు కోరుకునేది ప్రతిదీ ఉండాలని కోరుకుంటూ ఈకొత్త సంవత్సరం శుభాకాంక్షలు ’అని కల్యాణ్‌ దేవ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement