కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సామాన్యులు సహా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాన్నట్లు చెప్పారు.
త్వరలోనే కోలుకుంటానని, ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక నాగబాబు సైతం కల్యాణ్‌దేవ్ పోస్ట్‌పై స్పందించారు. త్వరగా కోలుకుంటావనే నమ్మకం, గెట్ వెల్ సూన్ మై బాయ్ అంటూ కామెంట్ చేశారు. ఇక హీరోయిన్ అవికా గౌర్ సహా పలువురు సన్నిహితులు, అభిమానులు కల్యాణ్ దేవ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేశారు.
చదవండి : ఎంత ఆస్తి ఉందో లైవ్‌లో చెప్పేసిన నాగబాబు
గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment