Kalyan Dev: The Best 4 Hours I Spend Every Week with My Daughter - Sakshi
Sakshi News home page

Kalyaan Dhev: శ్రీజ- కల్యాణ్‌ దేవ్‌ విడాకులు.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో క్లారిటీ..

Published Sun, Jun 18 2023 5:00 PM | Last Updated on Sun, Jun 18 2023 5:54 PM

Kalyan Dev: The best 4 Hours I Spend Every Week with my Daughter - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ- కల్యాణ్‌ దేవ్‌ దంపతులు కలిసి కనిపించక చాలాకాలమే అవుతోంది. పండగలు, పార్టీల్లోనూ వీళ్లు విడివిడిగానే దర్శనమిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఏడాదిన్నర కిందంటే ప్రచారం మొదలైంది. కానీ ఇంతవరకు దీనిపై అటు శ్రీజ, ఇటు కల్యాణ్‌ దేవ్‌ స్పందించనేలేదు. ఎప్పటికైనా శ్రీజ- కల్యాణ్‌ మళ్లీ కలుస్తారేమోనని ఎదురుచూస్తున్న అభిమానులకు కూడా నిరాశే ఎదురైంది.

తాజాగా కల్యాణ్‌ దేవ్‌ చేసిన పోస్ట్‌తో ఈ విడాకులపై క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. కూతురు నవిష్కతో కలిసి ఆడుకున్న ఫోటోలు షేర్‌ చేసిన కల్యాణ్‌.. 'వారంలో ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే' అని క్యాప్షన్‌ జోడించాడు. సాధారణంగా దంపతులు విడాకులు తీసుకుంటున్నప్పుడు కోర్టు పిల్లల బాధ్యత ఎవరికి అప్పజెప్పాలి? తల్లి లేదా తండ్రి దగ్గర ఎంత సమయం ఉండవచ్చు అనేది నిర్ణయిస్తుంది. అందులో భాగంగానే కల్యాణ్‌ దేవ్‌ వారంలో నాలుగు గంటలు మాత్రమే తన పిల్లలతో గడుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు కల్యాణ్‌కు వచ్చిన పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. 'నీ బిడ్డలతో నువ్వు ఉండేది కేవలం నాలుగు గంటలేనా? వినడానికే ఎంతో బాధగా ఉంది', 'అంటే మీరు మళ్లీ కలిసే అవకాశమే లేదా? విడాకులు మంజూరయినట్లేనా?' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్‌ నటుడు
దిల్‌ రాజు ముందే ఊహించాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement