కల్యాణ్ దేవ్
‘‘మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నా అనే టెన్షన్‌ని ప్రెషర్‌లా భావించకుండా ప్లెజర్‌లా తీసుకొని ఈ సినిమా చేశాను. చిరంజీవిగారు సినిమా చూడలేదు. రషెస్ మాత్రమే చూశారు. సినిమా ఇవాళ రిలీజ్ అవుతుంది. మొన్నటిదాకా చాలా టెన్షన్‌గా ఉండేది. నిన్నటి నుంచి ఎగై్జట్‌మెంట్‌గా ఉంది’’ అన్నారు కల్యాణ్ దేవ్. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించారు. మాళవికా నాయర్ కథానాయిక. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
► నాకు చిన్నప్పటి నుంచి కళలంటే ఇంట్రెస్ట్. మా పేరెంట్స్ బాగా ప్రోత్సహించేవారు. స్కూల్ డేస్‌లో స్కెచ్చింగ్, డ్యాన్స్, డ్రామాల్లో చురుకుగా పాల్గొనేవాణ్ని. స్కూల్‌లో ఓసారి చిరంజీవిగారి చేతుల మీదగా సర్టిఫికెట్ కూడా తీసుకున్నాను. ఇంజినీరింగ్ కంప్లీట్ అవ్వగానే బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే అది కుదర్లేదు.
► ‘విజేత’ సినిమా చేసే ముందు ఇండస్ట్రీలో నిలబడాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనే లాంగ్ టెర్మ్ గోల్స్ ఏం ఆలోచించలేదు. ఎంజాయ్ చేస్తూ చేశాను. యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చిన ఒక వారానికే ఈ ఆఫర్ వచ్చింది. విన్న వెంటనే నచ్చింది. ఒక కథ ఉంది అని మామయ్యగారికి చెప్పగానే ఆయన కూడా విన్నారు. ఆయనకూ చాలా బాగా నచ్చింది. ఆయన చెప్పిన ఒకే ఒక్క సజెషన్.. ఇందులో తండ్రి పాత్రకు మురళీ శర్మ అయితే బావుంటారని. అంతకు మించి ఏమీ చెప్పలేదు.
► చిరంజీవిగారికి ఉన్న ఎక్స్‌పీరియన్స్ మనందరికీ తెలిసిందే. నాకు కథ నచ్చింది, ఆయన కూడా కాన్ఫిడెంట్‌గా ఉండటంతో కళ్లు మూసుకొని ఈ సినిమా చేసేశాను. మన పక్కింటి కుర్రాడిలా ఉంటుంది నా పాత్ర. ఆకతాయిగా ఏ లక్ష్యం లేకుండా తిరిగే పాత్ర నాది. రొటీన్ లైన్ అయినప్పటికీ చాలా ఫ్రెష్‌గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ రాకేశ్.
► సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్‌డే ఏమీ అనిపించలేదు కానీసెకండ్ డే చాలా నెర్వస్‌గా అనిపించింది. రెండు పేజీల డైలాగ్ చెప్పాలి. మెల్లి మెల్లిగా వారానికి సెట్ అయిపోయాను.
► సత్యానంద్‌గారి దగ్గర ట్రైన్ అవుతున్నప్పుడు మా బ్యాచ్ ఫొటోలు పంపించారు. దాంట్లో సాయి కొర్రపాటిగారు నన్ను సెలెక్ట్ చేశారు. ‘ఈ కుర్రాడివి ఇంకొన్ని ఫొటోలు పంపించండి’ అంటే సత్యానంద్‌గారు చిరంజీవిగారి అల్లుడు అని చెబితే మామయ్యని అప్రోచ్ అయ్యారు. బిజినెస్, సినిమా ఏది ఈజీ అంటే ప్రస్తుతానికి సినిమాలు అంటానేమో.
► నెక్ట్స్ సినిమా ఏంటని ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకే జానర్‌కి స్టిక్ అయిపోవాలని లేదు.
Comments
Please login to add a commentAdd a comment