చిరంజీవి చెప్పిందే జరిగింది! | Chiranjeevi Comments On Kalyan devs Vijetha Movie | Sakshi
Sakshi News home page

అల్లుడితో కలిసి ‘విజేత’ చూసిన మెగాస్టార్‌

Published Fri, Jul 13 2018 9:03 AM | Last Updated on Fri, Jul 13 2018 11:02 AM

Chiranjeevi Comments On Kalyan devs Vijetha Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమైన హీరో కల్యాణ్‌ దేవ్‌. రాకేశ్‌ శశి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా తాజాగా విడుదలై పాజిటీవ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘విజేత’.. నగరంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో గురువారం సాయంత్రం అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ తెరంగేట్రం చేసిన విజేత మూవీని చిరంజీవి వీక్షించారు. మూవీ చాలా బాగా తీశారని దర్శకుడిని మెగాస్టార్‌ ప్రశంసించారని, తొలి సినిమా అయినా కల్యాణ్‌ దేవ్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించారని చిరు కితాబిచ్చినట్లు సమాచారం. చిరుతో పాటు కల్యాణ్‌ దేవ్‌, నిర్మాత అల్లు అరవింద్‌, మురళీ శర్మ, మూవీ యూనిట్‌ సభ్యులు ‘విజేత’ స్పెషల్‌ షో చూశారు. యంగ్‌ హీరో కల్యాణ్‌ దేవ్‌ కెరీర్‌ సజావుగా సాగాలని వారు ఆకాంక్షించారు.

కాగా, యాక్టింగ్‌ స్కూల్‌ నుంచి వచ్చిన ఒక వారానికే విజేత ఆఫర్‌ వచ్చిందని, కథను మామయ్యకి చెప్పగానే చాలా బాగా నచ్చిందన్నారని కల్యాణ్‌ దేవ్‌ ఇటీవల తన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీలో తండ్రి పాత్రకు మురళీ శర్మ అయితే బావుంటారని కల్యాణ్‌ దేవ్‌తో మెగాస్టార్‌ చెప్పిన మాటలు నిజమయ్యాయని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. సినిమాలో మురళీ శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీలో కల్యాణ్‌ దేవ్‌కు జోడీగా మాళవికా నాయర్‌ నటించారు.
సంబంధిత కథనాలు

మెగా అల్లుడి ‘విజేత’ మూవీ రివ్యూ

కథ విని చిరంజీవిగారు అలా అన్నారు

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement