
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ప్రముఖులను సైతం వదలడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కల్యాణ్ దేవ్‌కు సైబర్ వేధింపులు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఆయనను వేధిస్తున్నారు. కొంతమంది ఆగాంతకులు ఇన్‌స్టాగ్రామ్‌లో తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కల్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు. హీరో కల్యాణ్ దేవ్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కల్యాణ్ దేవ్‌ను వేధిస్తున్న 10 మందిని గుర్తించామని, వారి వివరాల కోసం ఇన్‌స్టాగ్రామ్ వారికి లేఖ రాశామని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే వారి పట్టుకొని చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాకు తెలిపారు.
( చదవండి : రెండో పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్)