
కల్యాణ్‌దేవ్, రచితారామ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రిజ్వాన్, ఖుషీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. కల్యాణ్ దేవ్‌తో పాటు నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఈ పాటలో నటిస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టెప్పులేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. తమన్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటతో పాటు మరో పాట చిత్రీకరిస్తే సినిమా పూర్తయినట్లే. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్‌స్టోరీ మిక్స్ చేసిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మా ‘సూపర్‌మచ్చి’. కల్యాణ్‌దేవ్ నటన, రచితారామ్ సినిమాకు ప్లస్సవుతుంది. తమన్ సంగీతం మా సినిమాకు హైలెట్ అవుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment